నన్ను అవమానిస్తే ఎన్టీఆర్ ను అవమానించినట్టే – లక్ష్మీ పార్వతి

దివంగత నటుడు, ముఖ్యమంత్రి నందమరి తారకరామారావు స్మారక చిహ్నంగా ఇవాళ(సోమవారం) ఆయన ఫోటోతో వంద రూపాలయ నాణేన్ని విడదల చేసింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రపతి చేతుల మీదుగా విడుదలైన ఈ కార్యక్రమానికి ఆయన కుటుంబాన్ని ఆహ్వానించారు.

అయితే ఆయన భార్యనైన తనను ఆహ్వానించలేదని రెండు మూడు రోజుల నుంచే ఆవేదన వ్యక్తం చేస్తోంది లక్ష్మీ పార్వతి. లక్ష్మీ పార్వతిని తమ తండ్రి భార్యగా ఆయన వారసులెవరూ అంగీకరించడం లేదు. అందుకే రాష్ట్ర పతి భవన్ నుంచి ఆమెకు ఆహ్వానం లేదు. కార్యక్రమం కూడా పూర్తయిన తర్వాత ఆమె తన అక్కసులను వెళ్లగక్కుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ సందర్భంగా లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ.. ” ఎన్టీఆర్ ప్రాణాలు తీసిన వాళ్ళు వారసులుగా చలామణి అవుతున్నారు.. భార్యగా నాణెం అందుకోడానికి అర్హత నాకే ఉంది.. వీళ్లకు లేదు.. ప్రాణాలు తీసిన వాళ్ళు నాణెం విడుదలకు వెళ్లారు. ఎన్నికల సమయంలో ఎన్టీఆర్ ను వాడుకుంటున్నారు.. ఎన్టీఆర్ నన్ను వివాహం చేసుకున్నారో లేదో.. అయన పిల్లలు సమాధానం చెప్పాలి.. నన్ను పిలవకుండా పురంధేశ్వరి, చంద్రబాబు అడ్డుకున్నారు.. ఎన్టీఆర్ భార్యను అని మెడలో ఫోటో పెట్టుకుని తిరగాలా..? ఎన్టీఆర్ తో వివాహం అయినట్టు ఫోటోలు, వార్తా కధనాలు ఉన్నాయి.. సాక్షాత్తు ఎన్టీఆర్ అనేకసార్లు బహిరంగంగా చెప్పారు.. నన్ను పెళ్ళి చేసుకోలేదు.. ఉంచుకున్నారు అని టిడిపి ప్రచారం చేస్తుంది.. ఎన్టీఆర్ నన్ను ఇల్లీగల్ గా పెట్టుకున్నారా.. పెళ్లి చేసుకున్నాడా.. చెప్పాలి.. ఎన్టీఆర్ యుగ పురుషుడు అంటున్నారు.. పెళ్లి చేసుకోకపోతే యుగ పురుషుడు అవుతాడా..? ఇంతకాలం ఎన్టీఆర్ కుటుంబంపై అభిమానంతో సైలెంట్ గా ఉన్నాను.. ఇకపై ఆ కుటుంబాన్ని వదిలిపెట్టను..

చంద్రబాబు, పురంధరేశ్వరి, బాలకృష్ణ అందరినీ బయటకు లాగుతా.. వచ్చే ఎన్నికల తరువాత వీళ్ళు రాజకీయాల్లో ఉండకుండా చేస్తా.. వీళ్ళ గురించి ఎన్టీఆర్ ఏమన్నారో ప్రజలకు వివరిస్తా.. ఎన్నాళ్ళు వీళ్ళ నుండి అవమానాలు ప