భగవంత్ కేసరి సెట్లో మోక్షజ్ఞ

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తోన్న సినిమా భగవంత్ కేసరి. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ మూవీలో శ్రీ లీల కీలక పాత్ర చేస్తోంది. ఈ దసరా బరిలో అక్టోబర్ 20న విడుదల కాబోతోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

ఆ మధ్య విడుదల చేసిన టీజర్ చూస్తే ష్యూర్ షాట్ లా కనిపిస్తోంది. అప్పటి నుంచే అంచనాలు పెరిగాయి. పైగా అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ ఎక్కువగా ఎంటర్టైన్మెంట్స్ ఎక్కువగా చేశాడు. ఫస్ట్ టైమ్ తన కెపాసిటీతో పాటు బాలయ్య ఇమేజ్ ను కూడా మిక్స్ చేసి ఆయనతో సినిమా చేస్తున్నాడు. ఇక రిలీజ్ కు దగ్గరగా ఉన్నా.. ఇంకా కొన్ని సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

ఈ క్రమంలో భగవంత్ కేసరి మూవీ సెట్స్ లో నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సందడి చేశాడు. దర్శకుడు అనిల్ రావిపూడి తో పాటు హీరోయిన్ శ్రీ లీల మాట్లాడాడు. షూటింగ్ అప్డేట్స్ ను గురించి వివరాలు తెలుసుకున్నాడు.


ఇక త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉండబోతోందని చెబుతున్నారు. ఆ మేరకు అతని ఫిజిక్ ను కూడా మార్చుకుంటున్నట్టు కనిపిస్తోంది. ఇంతకు ముందు అతని ఫోటోస్ బయటకు రానిచ్చేవారు కాదు. బట్ ఈ మధ్య అతను ఫిజిక్ పరంగా చాలా మారాడు.

హీరో మెటీరియల్ లా కనిపిస్తున్నాడు. అందుకే ఆ మధ్య సుహాసిన కొడుకు పెళ్లిలోని ఫోటోస్ తో పాటు ఈ ఫోటోస్ కూడా బయటకు వచ్చాయి. మొత్తంగా తండ్రి సినిమా సెట్స్ లో సందడి చేస్తోన్న తనయుడి ఫోటోస్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

Related Posts