మెగాస్టార్ తెలంగాణ యాస ..

మెగాస్టార్ చిరంజీవి నటుడుగా ఎంత ఫ్లెక్సిబుల్ గా కనిపిస్తాడో డైలాగ్స్ చెప్పడంలో అంతకు మించిన టెక్నిక్ చూపిస్తాడు. పైగా ఏ స్లాంగ్ అయినా పర్ఫెక్ట్ గా బ్లెండ్ చేస్తాడు. గతంలో అప్పుడప్పుడూ తెలంగాణ, శ్రీకాకుళం, నెల్లూరు యాసల్లో చిన్న చిన్న డైలాగ్స్ చెప్పి అలరించిన చిరంజీవి.. లాస్ట్ మూవీ వాల్తేర్ వీరయ్యలో సినిమా అంతా శ్రీకాకుళం స్లాంగ్ లోనే డైలాగ్స్ చెప్పాడు. కేవలం అక్కడక్కడా కాకుండా మాగ్జిమం ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా చెప్పాడు. ఇక ఆగస్ట్ 11న రాబోతోన్న భోళా శంకర్ లో ఈ సారి తెలంగాణ మాండలికంలో మాట్లాడుతున్నాడు అని అర్థం అవుతోంది. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ చూస్తే హైదరాబాదీ దక్కన్ స్లాంగ్ లో ఇరగదీశాడని తెలుస్తోంది.


ఈ టీజర్ లోనే వినిపించిన డైలాగ్స్ చూస్తే .. ” షికారుకొచ్చిన షేర్ ను బే”.. “ఎట్లిచ్చిన” అని మెగాస్టార్ అంటే ‘ అన్నా మస్తుఇచ్చినవ్ అన్నా’ అంటూ ఆయన రియాక్ట్ అవుతుంది. ఇక టీజర్ చివర్లో కూడా ” ఇస్టేట్ డివైడ్ అయినా అందర్ నా వాళ్లే, ఆల్ ఏరియాస్ అప్నా హై, నాకు హద్దుల్లేవ్ సరిహద్దుల్లేవ్.. 11 ఆగస్ట్ దేఖ్ లేంగే” అంటూ కంప్లీట్ దక్కన్ స్టైల్లో చెప్పిన స్లాంగ్ ఈ సారి మరింత కొత్తగా ఉండేలా కనిపిస్తోంది.

ఈ తరహాలో గతంలో శంకర్ దాదా ఎమ్.బి.ఎమ్.బిఎస్ లో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. బట్ ఈ సారి కంప్లీట్ గా సినిమా అంతా ఇదే స్లాంగ్ లో డైలాగ్స్ చెప్పేలా ఉన్నాడు. ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా తెలంగాణ మాండలికం రెండు తెలుగు రాష్ట్రాల్లోని అందరు ఆడియన్స్ కు అర్థం అవుతోంది. సో.. మెగాస్టార్ మరీ అంత కాంప్లికేటెడ్ గా కాకుండా కాస్త సింపుల్ లాంగ్వేజ్ తోనే మాట్లాడతాడు కాబట్టి ఇబ్బంది ఉండదు.. మొత్తంగా వాల్తేర్ వీరయ్యగా ఉత్తరాంధ్ర యాసలో అదరగొడితే.. ఇప్పుడు భోళా శంకర్ లా తెలంగాణ యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నాడు మెగాస్టార్.


ఇక టీజర్ చూస్తే కంప్లీట్ వింటేజ్ మెగాస్టార్ ను చూపిస్తూ మెహర్ రమేష్‌ ఈ భోళా శంకర్ ను రూపొందించాడు. టీజర్ ఫ్యాన్స్ ను ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేసేలా ఉంది. యాక్షన్ అయితే నెక్ట్స్ లెవెల్ లో కనిపిస్తోంది. తమన్నా, కీర్తి సురేష్ సినిమాకు ఎక్స్ ట్రా ఎసెట్ అని వేరే చెప్పక్కర్లేదు. ఇక మహతి స్వరసాగర్ ఫస్ట్ టైమ్ చిరంజీవి సినిమాకు సంగీతం అందించాడు. అతని ఆర్ఆర్ కూడా ఆకట్టుకునేలానే ఉంది. ఆర్ఆర్ తో పాటు వచ్చే మాంటేజ్ సాంగ్ లోని లైన్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి.
మొత్తంగా ఆగస్ట్ 11 ఈ సారి ఇండిపెండెన్స్ డే కి మెగా సెలబ్రేషన్స్ మామూలుగా ఉండవు అనిపిస్తోంది.

Related Posts