షికారుకు వచ్చిన షేర్ .. భోళా శంకర్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ టీజర్ రిలీజ్ అయింది. మెహెర్ రమేష్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా లో తమన్నా .. మెగాస్టార్ కి జోడీగా కీర్తి సురేష్ చెల్లిగా నటిస్తోంది. వాల్తేర్ వీరయ్య వంటి సాలిడ్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో భోళా పైనా భారీ అంచనాలు ఉన్నాయి. వాటిని అందుకునేలానే ఉంది ఈ టీజర్ చూస్తే.


మొత్తం ౩౩ మందిని చంపేశాడు అనే డైలాగుతో స్టార్ట్ అయినా టీజర్ .. కంప్లీట్ యాక్షన్ ప్యాక్డ్ గా ఉంది. మెగాస్టార్ మాస్ స్వాగ్ ను ఒక రేంజ్ లో ఎలివేట్ చేసాడు మెహెర్ రమేష్.
విలన్ అడ్డాలోకి అడుగుపెట్టి .. ఎవరు నువ్వు అంటే “షికారుకు వచ్చిన షేర్ ని బే ” అంటూ చిరంజీవి డైలాగ్ విజిల్స్ కొట్టేలా ఉంది.


చివర్లో ఏయ్ భోళా ఇది నా ఏరియా అని విలన్ అంటే .. ” స్టేట్ డివైడ్ అయినా అందర్ నా వాళ్ళే .అల్ ఏరియాస్ అప్నా హాయ్ .. నాకు హద్దుల్లేవు సరిహద్దుల్లేవ్ .. ” అని మెగాస్టార్ తెలంగాణ స్లాంగ్ లో చెప్పిన డైలాగ్ హైలైట్ ఉంది. మహతి స్వరసాగర్ ఆర్ ఆర్ అద్దిరిపోయింది. సింపుల్ గా వాల్తేర్ వీరయ్య తర్వాత మరోసారి వింటేజ్ మెగాస్టార్ ను చూడబోతున్నాం అని ఫిక్స్ అయిపోవచ్చు

Related Posts