మెగాస్టార్ విషయంలో ఇదో వార్నింగ్

మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ మూవీ భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. అందుకే కొందరు దీన్ని బోల్తా శంకర్ అంటున్నారు. ఒక సినిమా హిట్ ఫ్లాప్ అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు అనుకోవడం కరెక్ట్ కాదు. కథ, కథనాలతో పాటు ఆడియన్స్ టేస్ట్ కూడా తెలిసి ఉంటే ఇదేమంత కష్టం కాదు. రాజమౌళి లాంటి దర్శకులకు అది తెలుసు కాబట్టే అపజయం లేకుండా దూసుకుపోతున్నారు. ఇక కొన్నాళ్లుగా మెగాస్టార్ చిరంజీవి చేస్తోన్న సినిమాలు చూస్తే ఆయన ఆడియన్స్ పల్స్ ను మిస్ చేసుకున్నాడా అనిపిస్తుంది. అందుకే ఖైదీ నెంబర్ 150 తర్వాత వచ్చిన సినిమాల్లో వాల్తేర్ వీరయ్య తప్ప ఏదీ ఆకట్టుకోలేదు. సైరా నరసింహారెడ్డిలో పాత్ర పవర్ ఫుల్ గా ఉన్నా.. ఆయన ఏజ్ సూట్ కాలేదు.

గాడ్ ఫాదర్ రీమేక్ అయినా రావాల్సినంత క్రేజ్ రాలేదు. ఆచార్య గురించి మాట్లాడక్కర్లేదు. వాల్తేర్ వీరయ్య కూడా రొటీన్ సినిమానే. కాకపోతే ఈ ఫ్లాపుల తర్వాత వచ్చింది. అందులో వింటేజ్ మెగాస్టార్ ను ప్రెజెంట్ చేసిన తీరు.. రవితేజ పాత్ర.. పాటలు ఇవన్నీ ప్లస్ పాయింట్స్ గా మారి సినిమా విజయానికి దోహదం చేశాయి. భోళా శంకర్ ను కూడా అదే ఫార్మాట్ లో ఫాలో అయ్యాడు మెహర్ రమేష్. ఈ సారి మిస్ ఫైర్ అయింది. ఇక్కడ మెహర్ రమేష్ ను అనడానికి ఏం లేదు. ఈ రిజల్ట్ చాలామంది ముందే ఊహించారు కూడా.


భోళా శంకర్ రిజల్ట్ తర్వాతి దర్శకులకు ఒక వార్నింగ్ బెల్. కేవలం మెగాస్టార్ ఇమేజ్ ను మాత్రమే నమ్ముకుని ఆయన్ని “ఇలా చూపిస్తేనే” ప్రేక్షకులు చూస్తారు అనే ఆలోచన నుంచి బయటకు రావాలి. ఆయన్ని ఇప్పటి వరకూ చూసిన దానికి భిన్నంగా ఎలా చూపించాలి అనే కొత్త తరహా ఆలోచనలు చేయాలి. డ్యాన్సులు, ఫైట్ల విషయంలో చిరంజీవి చాలా ఇబ్బంది పడుతున్నాడు.. ఆ విషయం తెరమీద స్పష్టంగా కనిపిస్తుందన్న విషయాన్ని కూడా కొత్త దర్శకులు మైండ్ లో ఉంచుకోవాలి. ఆ తరహాలోనే ఆయన పాత్రలను డిజైన్ చేయాలి. మెగా ఇమేజ్ మాత్రమే రక్షిస్తుంది అనుకుంటే ఫ్లాపులో కాలేసినట్టే. ముఖ్యంగా ఇది దర్శకులకే వార్నింగ్ బెల్ లాంటిది. ఎందుకంటే మెగాస్టార్ చేయని సినిమాలు లేవు.

చూడని విజయాలు, ఫ్లాపులూ లేవు. ఇప్పుడంతా ఆయన కేవలం తనకో వ్యాపకంగా సినిమాలు చేస్తున్నాడు.ఈ టైమ్ లో అమితాబ్ ఎంచుకున్న కథలను చూశాం కదా. ఆ తరహాలో దర్శకులు ప్లాన్ చేసుకుంటే.. ఖచ్చితంగా ఈ వయసులో కొత్త మెగాస్టార్ ను చూసే అవకాశం ఉంటుంది. అఫ్ కోర్స్ ఆయన కూడా తన నుంచి డ్యాన్సులు ఫైట్లే ఎక్స్ పెక్ట్ చేస్తారు అన్న ఆలోచన నుంచి బయటకు రావాలి. కొత్తదనం ఉన్న కథలను ప్రోత్సహించాలి. ఆ తరహా కథలు తెచ్చిన దర్శకులను ఎంకరేజ్ చేయాలి. అప్పుడు మెగాస్టార్ లాంటి వింటేజ్ హీరోలు ఇకనైనా తెలుగు ప్రేక్షకులకు “కథలు” చెప్పే అవకాశం ఉంటుంది.

Related Posts