పవన్ కళ్యాణ్ ఓ.జి పోస్ట్ పోన్

పవన్ కళ్యాణ్‌ హీరోగా సుజిత్ డైరెక్షన్ లో మొదలైన సినిమా “ఓ.జి.” అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని అర్థం. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్‌ తో రొమాన్స్ చేయబోతోంది. మెయిన్ విలన్ గా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ నటిస్తుండగా ప్రకాష్‌ రాజ్, హరీష్‌ ఉత్తమన్, అర్జున్ దాస్, శ్రీయా రెడ్డి ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. డివివి దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఈ యేడాది డిసెంబర్ లో విడుదల చేస్తారు అనే ప్రచారం జరిగింది. కానీ ఆ టైమ్ కు సినిమా రావడం లేదు అని లేటెస్ట్ న్యూస్.

నిజానికి ఈ మూవీ ఇప్పటికే 50 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఉంది. ఇక మిగతా 50శాతంలో ఎక్కువగా పవన్ కళ్యాణ్‌ పోర్షన్ బ్యాలెన్స్ ఉంది. ప్రస్తుతం పవన్ పొలిటికల్ గా ఎక్కువ బిజీగా కనిపిస్తు్న్నాడు. దీంతో రెగ్యులర్ షూటింగ్ కు వచ్చే పరిస్థితి లేదు. ఈ కారణంగానే డిసెంబర్ లో విడుదల కావడం కష్టమే అంటున్నారు. ఆ తర్వాత ఎన్నికలు వున్నాయి. అవి కూడా పూర్తయిన తర్వాతే ఓజి రిలీజ్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది.


ఇక ప్రస్తుతం టాలీవుడ్ టాక్ ప్రకారం ఈ చిత్రాన్ని 2024 ఏప్రిల్ సెకండ్ వీక్ లో విడుదల చేసే అవకాశాలున్నాయట. అంతకు ముందు వారమే ఎన్టీఆర్, కొరటాల శివల దేవర విడుదలవుతుంది. దేవర తర్వాత వచ్చే సినిమా ఓజినే అంటున్నారు. మరోవైపు ఈ సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్‌ బర్త్ డే సందర్భంగా ఓ క్రేజీ అప్డేట్ ఇస్తున్నాం అంటూ ప్రకటించింది మూవీ టీమ్. ఏదైనా గ్లింప్స్ విడుదల చేయొచ్చు. దీంతో పాటు రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావొచ్చు. మొత్తంగా ఓజి డిసెంబర్ లో రావడం కష్టమే అనేది స్పష్టంగా వినిపిస్తోందిప్పుడు.

Related Posts