గీతాంజలి హీరోయిన్ రీ ఎంట్రీ

తెలుగులో ది గ్రేట్ లవ్ స్టోరీస్ లిస్ట్ తీస్తే టాప్ ఫైవ్ లో ఉండే సినిమా గీతాంజలి. మణిరత్నం డైరెక్ట్ చేసిన ఏకైక తెలుగు సినిమా ఇది. నాగార్జున, గిరిజ శెట్టర్ జంటగా నటించారు. పిసి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ, ఇళయరాజా సంగీతం హైలెట్ గా ఈ సినిమాను క్లాసిక్ గా మార్చాయి. ముఖ్యంగా క్యాన్సర్ పేషెంట్ గా గిరిజ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. నాగార్జున, గిరిజ మధ్య వచ్చిన సన్నివేశాలన్నీ ఎవర్ గ్రీన్ అనిపించుకున్నాయి.

పుట్టుక రీత్యా తను బ్రిటిషర్. కానీ అచ్చ తెలుగమ్మాయిలా అద్భుతంగా నటించింది. తనకు అప్పట్లో రోహిణి చెప్పిన డబ్బింగ్ మరో హైలెట్. లేచిపోదామన్న మొనగాడా అనే డైలాగ్, రైల్వే స్టేషన్ లో నాకెందుకు చెప్పలేదు అనే సీన్స్ లో గిరిజ జీవించేసింది. అందుకే ఒక్క సినిమాకే ఆమె లక్షలమందికి ఫేవరెట్ అయిపోయింది. తర్వాత తను మళయాలంలో మోహన్ లాల్ సరసన వందనం అనే సినిమా చేసింది. ఇది యావరేజ్. ఈ వందనం చిత్రాన్నే తెలుగులో నిర్ణయంగా నాగార్జునతో రీమేక్ చేశాడు దర్శకుడు ప్రియదర్శన్.


ఒక హిందీ సినిమా ఒప్పుకుని ఒక షెడ్యూల్ తర్వాత తప్పుకుంది గిరిజ. తెలుగులో 2002లో హృదయాంజలి అనే సినిమా చేసింది. విభిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ చిత్రం మూడు నంది అవార్డులు అందుకుంది. ఆ తర్వాత ఓ హిందీ మూవీలో కేమియో చేసిన తను ఇంగ్లండ్ కు వెళ్లిపోయింది. అక్కడే టీచర్ గా పనిచేస్తుంది అని అంటారు. అయితే ఇన్నేళ్ల తర్వాత తను మళ్లీ ఇండియన్ సినిమాలో రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. అది కూడా ఓ కన్నడ సినిమాతో. యస్.. గీతాంజలి గిరిజ బ్యాక్ టు యాక్టింగ్.


టాలెంటెడ్ యాక్టర్ రక్షిత్ శెట్టి నటించబోతోన్న “ఇబ్బని తబ్బిద ఇల్లెయాలి” అనే సినిమాలో తను ఓ కీలక పాత్ర చేయబోతోంది. ఈ మేరకు సినిమా నిర్మాణ సంస్థ పరంవహ్ స్టూడియోస్ తో పాటు హీరో రక్షిత్ శెట్టి కూడా ఆమెకు స్వాగతం చెబుతూ ఈ మేటర్ ను కన్ఫార్మ్ చేశారు. మరి కన్నడతో పాటు తెలుగులోనూ మన దర్శకులెవరైనా ఆమెను అప్రోచ్ అవుతారా.. అయితే ఎలాంటి పాత్రలతో వస్తుంది అనేది చూడాలి. ఏదేమైనా గిరిజ అంటే ఒక తరం ప్రేక్షకుల ఎవర్ గ్రీన్ క్రష్.

Related Posts