ఇటలీలో మొదలైన మెగా సెలబ్రేషన్స్

మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. ఈ మెగా సెలబ్రేషన్స్ కు ఇటలీ వేదికగా మారింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి లు నవంబర్ 1న పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకోసం ఇప్పటికే మెగా ఫ్యామిలీ అంతా ఇటలీ చేరుకుంది. తొలుత రామ్ చరణ్ దంపతులు, ఆ తర్వాత చిరంజీవి దంపతులు ఇటలీలలో అడుగుపెట్టారు. కేవలం చిరు, చెర్రీలు మాత్రమే కాదు.. ఉపాసన తల్లిదండ్రులు కూడా ఇటలీలో సందడి చేస్తున్న ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

మరోవైపు వరుణ్, లావణ్య పెళ్లికి పవన్ కళ్యాణ్ వెళతాడా? లేదా? అనే సందేహం కూడా వచ్చింది. కానీ.. ఇప్పటికే తన భార్య అన్నా తో కలిసి ఇటలీ వెళ్లాడు పవర్ స్టార్. మరోవైపు అల్లు అర్జున్ కూడా సతీ సమేతంగా ఇటలీ బయలుదేరాడు. మొత్తంమీద.. మెగా సెలబ్రేషన్స్ ఇప్పుడు ఇటలీలో గ్రాండ్ గా జరగబోతున్నాయన్నమాట.

Related Posts