యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్య.. తమిళ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య లు గత కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే.

వీరి వివాహ నిశ్చితార్థం తాజాగా చెన్నైలో జరిగింది. చెన్నైలో అర్జున్ నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఈ నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఇరు కుటుంబాలకు చెందిన బంధువుల సమక్షంలో నిర్వహించారు.

ఈ నిశ్చితార్థ వేడుకలో ఉమాపతి రామయ్య ధరించిన డ్రెస్ ని ముంబై కి చెందిన మనీష్ మల్హోత్రా డిజైన్ చేయగా.. ఐశ్వర్య అర్జున్ ధరించిన డ్రెస్ ను జయంతి రెడ్డి డిజైన్ చేశారు.

5 క్యారెట్ బర్మీస్ రూబీ విత్ డైమండ్ అండ్ వైట్ గోల్డ్ తో చేసిన రింగ్స్‌ని ఐశ్వర్య అర్జున్ ధరించగా.. ఉమాపతి గోల్డ్ అండ్ డైమండ్ రూబీ ధరించారు.

ఐశ్వర్య, ఉమాపతి రామయ్య ల వివాహం వచ్చే యేడాది మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుందట.
