ముంబై షెడ్యూల్ పూర్తిచేసుకున్న ‘తలైవర్ 170‘

సూపర్ స్టార్ రజనీకాంత్ తన కొత్త చిత్రాన్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నాడు. ‘జైలర్‘ హిట్ తో మంచి జోష్ మీదున్న రజనీకాంత్.. ఇటీవలే తన 170వ సినిమాకి పట్టాలెక్కించాడు. తొలుత చెన్నైలో కొంతభాగం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఆ తర్వాత ముంబైలో మరో షెడ్యూల్ ని మొదలుపెట్టుకుంది. ముంబై షెడ్యూల్ లో సూపర్ స్టార్ రజనీకాంత్.. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.

33 ఏళ్ల తర్వాత రజనీకాంత్-అమితాబ్ కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ముంబై షెడ్యూల్ కి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కుర్చీలో కూర్చుని అమితాబ్ ఫోన్ చూసుకుంటుంటే.. పక్కనే ఆనుకుని నిలబడిన రజనీకాంత్ ఫోటో ఆకట్టుకుంటుంది. ‘జై భీమ్‘తో దర్శకుడిగా మంచి ప్రశంసలు పొందిన టి. జె. జ్ఞానవేల్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

Related Posts