కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ ‘ఆదికేశవ’

ఈవారం విడుదలవుతోన్న చిత్రాలలో వైష్ణవ్ తేజ్ నటించిన ‘ఆదికేశవ’ ఒకటి.
ఇప్పటివరకూ రొమాంటిక్ ఇమేజ్ పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన వైష్ణవ్ నటించిన కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజ్ ఇది. టాలీవుడ్ లో బిజీయెస్ట్ ప్రొడక్షన్ హౌజ్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ తో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘ఆదికేశవ’ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫేవరెట్ స్క్రీన్ నేమ్ బాలు పాత్రలో కనిపించబోతున్నాడు వైష్ణవ్. క్వారీ తవ్వకానికి అడ్డొస్తుందనే ఉద్దేశంతో.. ఒక శివాలయాన్ని పడగొట్టడానికి విలన్ ప్రయత్నిస్తాడు.దీంతో రొమాంటిక్ బాయ్ బాలు కాస్తా రుద్రకాళేశ్వరుడిగా మారి విలన్ భరతం పట్టడమే ‘ఆదికేశవ’ కథగా ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. వైష్ణవ్, శ్రీలీల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు.. హీరో వైష్ణవ్, విలన్ జోజు జార్జ్ మధ్య యాక్షన్ సీక్వెన్సెస్ ట్రైలర్ లో హైలైట్స్ గా నిలిచాయి.

రాధిక, సుదర్శన్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. నవంబర్ 24న వరల్డ్ వైడ్ గా ‘ఆదికేశవ’ గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts