డిఫరెంట్ గా మామా మశ్చీంద్రా ట్రైలర్

డబుల్ రోల్, త్రిబుల్ రోల్ అంటూ ఇప్పటికే చాలా సినిమాలు చూశాం. వీటిలో ఎక్కువగా వీళ్లంతా ఒకే తల్లి పిల్లలుగా ఉంటారు. కానీ అందుకు భిన్నంగా ఓ కొత్త కోణంలో త్రిపాత్రాభినయంతో వస్తున్నాడు సుధీర్ బాబు. అతను మూడు పాత్రల్లో నటించిన సినిమా మామా మశ్చీంద్రా. ఈ టైటిల్ తో పాటు సుధీర్ లుక్స్ వచ్చినప్పుడు జనాలు పెద్దగా పట్టించుకోలేదు అనేది నిజం. టీజర్ కొంత వరకూ ఆకట్టుకుంది. బట్ కాన్సెప్ట్ ఏంటనేది మాత్రం అర్థం కాలేదు. ఇక లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్‌ బాబు చేతుల మీదుగా విడుదల చేశారు. ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలను మార్చేసిందంటే అతిశయోక్తి కాదు. కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది.


” ఈ సృష్టిలో నువ్వొక్కడివే నిజం. నీ ఫీలింగ్స్ ఎవ్వడితోనూ పంచుకోకు. లేదూ ఎవడితోనన్నా షేర్ చేసుకోవాలనిపిస్తుందా.. డైరీ రాయ్. ఏదో ఓల్డ్ కాన్సెప్ట్ అనుకోకు. బ్రహ్మాండంగా వర్కవుట్ అవ్వుద్ది.. ఒకవేళ ఎవ్వరూ చదవకూడని రహస్యాలున్నా కూడా ఒకసారి రాసి పడెయ్.. వెంటనే కాల్చి పడెయ్.. ” డైలాగ్ తో స్టార్ట్ అయిన ట్రైలర్ తర్వాత కొన్నేళ్ల తర్వాత అన్నట్టుగా మొదలవుతుంది. ఇద్దరు అమ్మాయిలు దాదాపు ఒకేలా ఉన్న మరో ఇద్దరు కుర్రాళ్లతో ప్రేమలో పడతారు. అయితే ఈ కుర్రాళ్లకు ఆ ఓల్డ్ డైరీ రాసిన వ్యక్తికి సంబంధం ఉంది. ఈ కలలిద్దరూ సీనియర్ సుధీర్ బాబు చెల్లి కొడుకులు. అంచేత వీరికి మేనమామ పోలికలతో పుడతారు. అయితే ఆ వ్యక్తికి చెల్లికి మధ్య ఉన్న గొడవలేంటీ.. ఈ సీనియర్ సుధీర్.. తనలాగే ఉన్న మేనళ్లుల్లను ఎందుకు చంపాలనుకుంటున్నాడు.. అనేది సినిమాలో కనిపించే ట్విస్ట్ అండ్ కీ పాయింట్ లా ఉంది.


ఈ చిత్రంలో సుధీర్ సరసన మృణాలిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్లుగా.. హర్ష వర్ధన్, అలీ రెజా, హరితేజ, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హర్షవర్ధన్ దర్శకుడు. సునీల్ నారంగ్, పుష్కర్ రామ్ మోహన్ నిర్మించారు. ఎలా చూసినా ఓ కొత్త కాన్సెప్ట్ తో కనిపిస్తోంది ఈ మామా మశ్చీంద్రా. మూడు పాత్రలూ పోటా పోటీగా ఉన్నాయి. కాకపోతే కాస్త చబ్బీగా ఉన్న సుధీర్ బాబు మేకప్ ఎబ్బెట్టుగా కనిపిస్తోంది. ఆ ఫేస్ ను థియేటర్ లో చూడాలంటే కాస్త ఇబ్బందే. బట్ ఈ మూవీ కాన్సెప్ట్ తో కొట్టబోతోంది అనిపిస్తోంది. మరి కొన్నాళ్లుగా సాలిడ్ హిట్ కోసం చూస్తోన్ను సుధీర్ కు ఈ మామా మశ్చీంద్రా ఆ విజయాన్ని ఇస్తుందా లేదా అనేది అక్టోబర్ 6న చూడాలి.

Related Posts