రవితేజ విధ్వంసానికి తేదీ సిద్ధం

మాస్ మహరాజ్ రవితేజ దూకుడుకు టాలీవుడ్ సైతం ఆశ్చర్యపోతోంది. రిజల్ట్స్ తో పనిలేకుండా కంటిన్యూస్ మూవీస్ తో దూసుకుపోతున్నాడు. ఈ యేడాది టైగర్ నాగేశ్వరరావుతో కలిపి మూడు సినిమాలు అవుతాయి. ఈ నంబర్ ను నెక్ట్స్ ఇయర్ కూడా కంటిన్యూ చేయబోతున్నాడు. అందులో భాగంగా తన మరో సినిమా ఈగల్ తో 2024 సంక్రాంతి బరిలోకి దిగుతున్నా అని ముందు నుంచీ చెబుతున్నాడు. లేటెస్ట్ గా ఆ విషయాన్ని కన్ఫార్మ్ చేశాడు. సంక్రాంతి వార్ విషయంలో ఇప్పటికే టాలీవుడ్ లో రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే స్ట్రాంగ్ గా ఉన్నవాళ్లు.. మన సినిమా రావొచ్చు అనుకుంటున్నవాళ్లు ముందుగానే ఖచ్చితంగా చెప్పేస్తున్నారు.

అలా మాస్ రాజా కొత్త సినిమా ఈగిల్ ను సంక్రాంతి బరిలో జనవరి 13న విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. సో ఇంకెవరైనా రావాలనుకుంటే ఆ తర్వాత రోజు లేదా ముందు రోజు ప్లాన్ చేసుకుంటారన్నమాట.


ఇక ఇప్పటికి సంక్రాంతికి ఖచ్చితంగా వచ్చే సినిమాల్లో ఈగల్ తో పాటు విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమాతో పాటు నాగార్జున నా సామిరంగా కూడా ఉన్నాయి. దీంతో పాటు గుంటూరు కారం కూడా ఉంటుంది. అయితే వీళ్లు అక్టోబర్ లో ఓ ఖచ్చితమైన నిర్ణయానికి వస్తారు అనే ప్రచారం కూడా ఉంది. బట్ 99శాతం గుంటూరు కారం సంక్రాంతి బరిలో ఉంటుందనే అనుకోవచ్చు.

మొత్తంగా దిల్ రాజు, విజయ్ దేవరకొండ, పరశురామ్ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం అని చెప్పగానే వీళ్లు వెంటనే రియాక్ట్ అయ్యి డేట్ వేశారు. ఒకవేళ దిల్ రాజు జనవరి 13నే అనుకుంటే ఇప్పుడు మార్చుకుంటాడా లేక మాస్ రాజాతో ఢీ అంటాడా అనేది చూడాలి. అసలే ఈగల్ కు విధ్వంసానికి కొత్త అర్థం అనే క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ విద్వంసం ఎవరిది అవుతుందో మరి.

Related Posts