అఫీషియల్ గా ఆస్కార్ ఎంట్రీ ఇస్తోన్న సినిమా

ఒకప్పుడు ఇండియన్ సినిమా ఆస్కార్ గురించి ఆలోచించడమే గొప్ప అనుకున్నారు. అక్కడి నుంచి మన ప్రయాణం ఆస్కార్స్ అందుకునే వరకూ వచ్చింది. అందుకే ఇప్పుడు ఆస్కార్ ఎంట్రీ అనే మాట కూడా సాధారణం కాబోతోంది. అయినా అంతర్జాతీయ స్థాయిలో మన జెండా ఎగరేసే సినిమాలంటే ఖచ్చితంగా ఓ క్యూరియాసిటీ ఉంటుంది. అలాగని అన్ని సినిమాలూ ఆ బరిలో నిలవలేవు. ఓ యూనిక్ కంటెంట్ ఉండాలి. ఎంటర్టైన్మెంట్ తో పాటు ఏదో ఒక సందేశాన్ని చెప్పాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. అలా ఈ సారి ఆస్కార్ బరిలోకి అఫీషియల్ ఎంట్రీ సాధించింది మళయాల సినిమా ” 2018″. 2018లో ఆ రాష్ట్రంలో వచ్చిన వరదల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని నమోదు చేసింది.

మళయాలంలో అయితే అనేక రికార్డులను బద్ధలు కొట్టింది. అందరూ చిన్నవాల్లే. కానీ బలమైన కంటెంట్ ఉంది. వాస్తవానికి దగ్గరా ఉన్న కథ, కథనాలతో పాటు అత్యంత సహజంగా ఉన్న విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ ఆ ఫీల్ ను, భయాన్ని ప్రతి ప్రేక్షకుడికీ కలిగించాయి. అందుకే ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా విజయంతో పాటు ప్రశంసలు కూడా అందుకుంది.


ఈ చిత్రంలో చాలామంది ఆర్టిస్టులు ఉన్నా.. ప్రధానంగా కనిపించిన పాత్ర టోవినో థామస్. ఎక్స్ ఆర్మీ మేన్ గా పిరికివాడి పాత్రలో అతను ఆకట్టుకుంటాడు. చివర్లో ఓ కళ్లు లేని వ్యక్తిని కాపాడబోయి చనిపోతాడు. టోవినోతో పాటు కుంచకో బోబన్, అపర్ణా బాలమురళి, ఆసిఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్, నరైన్, లాల్, తన్వి రామ్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని జూడ్ ఆంథనీ జోసెఫ్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఆస్కార్ కు వెళ్లిందంటే ఇతరుల నుంచి ఎలాంటి విమర్శలూ రావు. అంత కంటెంట్ ఈ మూవీకి ఉంది. మరి ఈ సందర్భంగా 2018 ఆస్కార్ విజేతగా నిలవాలని కోరుకుందాం.

Related Posts