విజయ్ దేవరకొండతో మజిలీ బ్యూటీ

విజయ్ దేవరకొండ కూడా దూకుడు పెంచాడు.వరుస ప్రాజెక్ట్ తో దూసుకుపోతున్నాడు. శివ నిర్వాణ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఖుషీ మూవీ షూటింగ్ అయిపోయింది. ఈ యేడాది సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది.

కొన్నాళ్ల క్రితమే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా స్టార్ట్ అయింది. ఇందులో స్పై గా నటిస్తున్నాడు విజయ్. ఇక రీసెంట్ గా పరశురామ్ డైరెక్షన్ లో మరో సినిమా స్టార్ట్ అయింది. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

ఇందులో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తను కూడా సెట్స్ లో జాయిన్ అయింది. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కు కూడా స్పేస్ ఉంది. ఆ స్పేస్ ను మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ తో ఫిల్ చేశారు. యస్.. మజిలీతోనే టాలెంటెడ్ అనిపించుకున్న దివ్యాంశం కౌశిక్ కు ఇది మంచి ఆఫర్ అనే చెప్పాలి.


సెకండ్ హీరోయిన్ అయినా.. సమంత ఉన్నా.. మజిలీ మూవీలో తనదైన ముద్ర వేసింది దివ్యాంశ. ఆ తర్వాత కాస్త ఆలస్యంగానే ఆఫర్స్ వచ్చినా.. అవేవీ ఆకట్టుకోలేకపోవడంతో అమ్మడు రేస్ లో చాలా వెనకబడింది.

మజిలీ తర్వాత చేసిన రామారావు ఆన్ డ్యూటీ, మైఖేల్, టక్కర్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. మైఖేల్, టక్కర్ సినిమాల్లో ఇంటిమేట్స్ సీన్స్ లోనూ జీవించేసింది దివ్యాంశ. టాలెంట్ తో పాటు అందాలారబోతలోనూ ఆకట్టుకుంటోన్న దివ్యాంశకు విజయ్ దేవరకొండ మూవీ ఖచ్చితంగా బ్రేక్ ఇస్తుందంటున్నారు. పైగా పరశురామ్ సినిమాల్లో అన్ని పాత్రలకూ మంచి ప్రాధాన్యతే ఉంటుంది. అందుకే అమ్మడి పాత్ర కూడా ఇంపాక్ట్ వేసేలానే ఉంటుందనే టాక్ ఉంది.

Related Posts