సూర్య కంగువా గ్లింప్స్ వస్తోంది

మోస్ట్ టాలెంటెడ్ స్టార్ సూర్యకు తెలుగులోనూ తిరుగులోనూ తిరుగులేని మార్కెట్ ఉంది. బట్ ఆ మార్కెట్ కు తగ్గ సినిమాలు కొంతకాలంగా రావడం లేదు అతన్నుంచి. బట్ ఒకేసారి ప్యాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఈ సారి కంగువ అనే సినిమాతో వస్తున్నాడు.

కంగువ అంటే నిప్పులాంటి శక్తి ఉన్న మనిషి అని అర్థం. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ శివ రూపొందిస్తోన్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఓ క్యూరియాసిటీ ఉంది. సూర్య ఇందులో ఐదు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించి వచ్చిన ఒకటీ రెండు లుక్స్ కే అంచనాలు పెరిగాయి.

దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ మూవీ మరోసారి ప్యాన్ ఇండియన్ మార్కెట్ లో సౌత్ జెండాను ఎగరేస్తుందని నమ్ముతున్నారు.ఆ నమ్మకాన్ని కలిగించేందుకు ఈ నెల 23న కంగువా ఫస్ట్ గ్లింప్స్ రాబోతోంది.


ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయే నటుడు సూర్య. అయితే ఒకే సినిమాలో ఐదు పాత్రలు చేయడం ఫస్ట్ టైమ్. అందుకే మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక కోలీవుడ్ లో వరుసగా అజిత్ తోనే మూడు సినిమాలు చేసిన మూడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు దర్శకుడు శివ. ఇక అతను అజిత్ కే పరిమితం అవుతాడా అంటూ సెటైర్స్ కూడా పడుతున్న టైమ్ లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. మరి ఈ గ్లింప్స్ తో కంగువా ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాడో అర్థం అవుతుంది.

Related Posts