మెగాస్టార్ సినిమా అంటే మాస్ కు ఫీస్ట్. మంచి ఫైట్లు.. అంతకు మించిన గ్రేసీ డ్యాన్సులు.. అదిరిపోయే డైలాగ్స్ అంటూ చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉంటాయి. మరి ఇవేం లేకుండా ఆయన్నుంచి సినిమా వస్తే ఆడియన్స్ చూస్తారా అంటే అనుమానమే అని చెప్పాలి.
అయినా ఆ అనుమానాన్ని నిర్ధారించుకోవడానికి మెగాస్టార్ ఆ ప్రయోగం చేస్తున్నాడు. తన నెక్ట్స్ మూవీలో ఇవేం ఉండవట. కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రంలో చిరంజీవి పాత్ర చాలా సింపుల్ గా ఉంటుందట.సాఫ్ట్ గా కనిపిస్తాడట. మాస్ కు నచ్చే అంశాలేవీ సినిమాలో ఉండవు అని చెబుతున్నారు.బట్ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా ఉంటుందట.
ఈ సినిమాలో చిరంజీవి పాస్ పోర్ట్ ఆఫీస్ లో ఓ సాధారణ ఉద్యోగిలా కనిపిస్తాడట. ఆయన ఇప్పటి వరకూ చేయని పాత్ర ఇది. మెగాస్టార్ సరసన త్రిష హీరోయిన్ గా నటించే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇక మరో హీరోగా డిజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డను తీసుకోవాలనుకున్నారు.
ఈ మేరకు న్యూస్ వస్తున్నాయి కానీ.. అతను ఇంకా కన్ఫార్మ్ చేయలేదు. ఇంకా చెబితే ఈ సినిమాలో సెకండ్ హీరోగా చేయడం సిద్ధుకు ఇష్టం లేదట. అదే విషయాన్ని మేకర్స్ కు ఇన్ డైరెక్ట్ గా చెప్పాడు అంటున్నారు. విశేషం ఏంటంటే.. సిద్ధు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా.. ఆ పాత్ర చేసే నటుడు కోసం శ్రీ లీలను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకునే ఉన్నారు. సిద్ధు కాకపోతే మరో హీరో వస్తాడు. కానీ అతను ఇలాంటి ఆఫర్ ఎందుకు వద్దనుకుంటున్నాడో కానీ.. అంత ఇమేజ్ ఉన్న రవితేజ వాల్తేర్ వీరయ్యలో అదరగొట్టలేదా..?