టాలీవుడ్

SSMB 28 : మహేష్ బాబు కు మనోజ్ టైటిల్ ఎన్టీఆర్ క్యాప్షన్

మహేష్‌ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తోన్న సినిమా టైటిల్ పవర్ ఫుల్ గానే ఉన్నా.. ఫ్యాన్స్ లో మాత్రం పోలికలు వస్తున్నాయి. ఈ టైటిల్ సొంతంగా పెట్టినట్టు లేదు అంటున్నారు. గుంటూరు కారం అని లేదు కానీ.. గతంలో మంచు మనోజ్ గుంటూరోడు అనే టైటిల్ తో ఓ సినిమా చేశాడు. అది కూడా గుంటూర్ మిర్చి యార్డ్ నేపథ్యంలో సాగే కథే.

మహేష్ బాబు గ్లింప్స్ చూసిన తర్వాత ఇదీ మిర్చి యార్డ్ బ్యాక్ డ్రాప్ స్టోరీనే అనిపిస్తోంది. అంటే రెండు కథలకు పోలిక ఉండకపోవచ్చు కానీ టైటిల్ తో పాటు నేపథ్యాలుచాలా దగ్గరగా ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి పెట్టిన క్యాప్షన్ కూడా ఆల్రెడీ ఎన్టీఆర్ చిత్రానికి వాడిందే.


గతంలో ఎన్టీఆర్ – కృష్ణవంశీ కాంబినేషన్ లో వచ్చిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాఖీ’ మూవీ క్యాప్షన్ ఇదే. ‘రాఖి’ హైలీ ఇన్ ఫ్లామబుల్ అనే క్యాప్షన్ ఉంటుంది. ఆ చిత్రంలో ఎన్టీఆర్ పెట్రోల్ ప్యాకేట్స్ తో విలన్స్ ను తగులబెడుతుంటాడు కాబట్టి క్యాప్షన్ కరెక్ట్ గా కుదిరింది. ఇటు చూస్తే గుంటూరు ఘాటుకు ఈ భారీ విస్ఫోటనానికి సంబంధం ఏం ఉంటుందనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి పాత విషయాలను గుర్తుకు తెచ్చేలానే కొత్త సినిమాతో వస్తున్నాడని అర్థం అవుతోంది.

Telugu 70mm

Recent Posts

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

37 mins ago

Mirnalini Ravi

44 mins ago

Ketika Sharma

58 mins ago

Janhvi Kapoor

1 hour ago

NehaSolanki

1 hour ago