ప్రతి దర్శకుడికీ ఓ సెంటిమెంట్ ఉంటుంది. అలాగని సెంటిమెంట్స్ కు సూపర్ హిట్స్ రాలతాయి అని చెప్పలేం. కాకపోతే వారి ఫీలింగ్ వారిది. దాన్ని ఫాలో అవుతూ ఒక నమ్మకం పెంచుకుంటారు. గతనాలుగు సినిమాలుగా ఓ సెంటిమెంట్ ను ఫాలో అవుతోన్న త్రివిక్రమ్ సడెన్ గా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు.
అదే ‘అ’. అ అనే అక్షరంతో తన సినిమా టైటిల్ ను పెడుతున్నాడు త్రివిక్రమ్. ‘అ ఆ’ మూవీ నుంచి మొదలై.. అగ్నాతవాసి, అరవిందసమేత, అల వైకుంఠపురములో అంటూ ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేశాడు. వీటిలో పవన్ కళ్యాణ్ అగ్నాత వాసి డిజాస్టర్ అయితే మిగతా మూడు బ్లాక్ బస్టరస్ అయ్యాయి. సో సెంటిమెంట్ అన్ని సార్లూ వర్కవుట్ కాదు అని తేలిపోయింది.అలా అనుకున్నా ఈ మూవీ తర్వాతే సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సింది.
కాదు అని అరవింద, అల వైకుంఠపురములో వరకూ అదే కంటిన్యూ చేయడంతో అంతా త్రివిక్రమ్ తర్వాతి అన్ని సినిమాలకూ అ అక్షరం ఉంటుందనే అనుకున్నారు. బట్ మహేష్ బాబు మూవీతో ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేశాడు.
మహేష్ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ఫిక్స్ చేశాడు.టైటిల్ ఘాటుగానే ఉన్నా.. ఎందుకో అ అక్షరం మిస్ అయిన ఫీలింగ్ ఆయన ఫ్యాన్స్ లో ఉంది. అయినా సినిమాకు కంటెంట్ దానికి తగ్గ టైటిల్ ఇంపార్టెంట్ కానీ.. అక్షరాలు కాదు కదా అనే వారూ ఉన్నారు. ఏమో.. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి సెంటిమెంట్స్ కు చాలా వాల్యూ ఇస్తారు. మరి త్రివిక్రమ్ సెంటిమెంట్ కు ఎంత వాల్యూ ఉందనేది గుంటూరు కారం రిజల్ట్ చెబుతుంది.
Politics in Telugu states has become more heated now. At such a time, the original…
Dashing Puri Jagannadh and Ustad Ram's combo 'Ismart Shankar' became a super duper hit. Now…
గతంలో ఎప్పుడూ లేనివిధంగా మలయాళం నుంచి చాలా తక్కువ సమయంలో నాలుగు బ్లాక్‌బస్టర్స్ వచ్చాయి. ఆ చిత్రాలే 'ప్రేమలు, ది…
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ 'ప్రతినిధి…
If compared to the heroes in the film industry.. the span of heroines is very…
డాషింగ్ పూరీ జగన్నాధ్, ఉస్తాద్ రామ్ కాంబోలో వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఇప్పుడా సినిమాకి…