నెల రోజులు వాయిదా పడ్డ ‘లవ్ మీ’

ఎన్నికల ప్రభావంతో తెలుగు సినిమాల వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ఏప్రిల్ 25న రావాల్సిన ‘ప్రతినిధి 2’ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే.. సెన్సార్ కార్యక్రమాలు పూర్తికాకపోవడంతోనే ‘ప్రతినిధి 2’ వాయిదా పడిందనే ప్రచారం ఉంది. లేటెస్ట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న ‘లవ్ మీ’ మూవీ కూడా వాయిదా పడింది. ఏప్రిల్ 25న విడుదలకావాల్సిన ‘లవ్ మీ’ చిత్రం మే 25న థియేటర్లలోకి రాబోతుంది.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ఎక్కువగా అందించే దిల్ రాజు కాంపౌండ్ నుంచి వస్తోన్న ఘోస్ట్ లవ్ స్టోరీ ‘లవ్ మీ’. ఈ మూవీకి ‘ఇఫ్ యూ డేర్’ అనేది ట్యాగ్ లైన్. ఆశిష్, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకుడు. వైవిధ్యభరితమైన కథాంశంతో తెరకెక్కిన ‘లవ్ మీ’ ఆడియన్స్ కు ఓ విభిన్నమైన అనుభూతిని అందిస్తోందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు. మరి.. ‘బేబి’తో బ్లాక్ బస్టర్ అందుకున్న వైష్ణవి చైతన్య ‘లవ్ మీ’తో ఆశిష్ కి కూడా తన లక్ పంచుతుందేమో చూడాలి.

Related Posts