మే నెల మొత్తం పాటల పండగే

ఈ ఏడాది ద్వితియార్థంలో టాలీవుడ్ నుంచి రాబోయే పాన్ ఇండియా మూవీస్ సందడి మామూలుగా లేదు. మొదటిగా ఆగస్టులో ‘పుష్ప 2’ విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన వేర్ ఈజ్ పుష్ప, బన్నీ బర్త్ డే స్పెషల్ గా రిలీజైన టీజర్ లకు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. ఈ ప్రమోషనల్ కంటెంట్ తో ‘పుష్ప 2’ ఎప్పుడెప్పుడు వస్తోందా? అనే ఆసక్తితో ఎదురుచూస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇక.. మే 1న ‘పుష్ప 2’ ఫస్ట్ సింగిల్ కి ముహూర్తం సెట్ అయిన సంగతి తెలిసిందే.

‘పుష్ప 2’ కంటే ముందే జూన్ లో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతోంది ‘డబుల్ ఇస్మార్ట్’. ‘పుష్ప 1’ని దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ చేసినట్టే.. ‘ఇస్మార్ట్ శంకర్’ని మ్యూజికల్ గా మరో లెవెల్ లో నిలబెట్టాడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ. మళ్లీ మణిశర్మ కంపోజిషన్ లో వస్తోన్న ‘ఇస్మార్ట్ శంకర్’ సీక్వెల్ ‘డబుల్ ఇస్మార్ట్’ పాటలపై చాలా అంచనాలున్నాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న ‘డబుల్ ఇస్మార్ట్’ నుంచి ఫస్ట్ సింగిల్ మే 15న రాబోతుందట.

మే నెలలోనే మరో రెండు పాన్ ఇండియా మూవీస్ ‘కల్కి, దేవర’ పాటలు కూడా సందడి చేయబోతున్నాయి. అసలు మే 9నే విడుదలవ్వాల్సిన ‘కల్కి’కి సంబంధించి ఇప్పటివరకూ టీజర్స్ మాత్రమే సందడి చేశాయి. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కి సంబంధించి పాటల పండగ ఇంకా మొదలవ్వలేదు. మే నెలలోనే ‘కల్కి’ పాటల ప్రచారానికి శ్రీకారం చుట్టనుందట టీమ్.

రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ పాటలను కూడా మే నెల నుంచే ఒక్కొక్కటిగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ ‘దేవర’ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. పాటలు ఇవ్వడం కాస్త లేటైనా.. ‘దేవర’ కోసం అదిరిపోయే ఆల్బమ్ అందిస్తున్నాడట అనిరుధ్ రవిచందర్. ‘దేవర 1’ అక్టోబర్ లో దసరా కానుకగా విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts