సోషల్‌ మీడియాలో విమర్శలు చేస్తున్న వారిపై పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కఠిన చర్య

సోషల్‌ మీడియాలో పిచ్చిరాతలు రాస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని పదిరోజుల క్రితం హైదరాబాద్‌ డిజిపి రవిగుప్తా గారిని కలిసి మీడియాతో పాటు సోషల్‌ మీడియాలో జరిగే అసత్య ప్రచారాలకు సంబంధించిన అనేక విషయాలను వివరించారు టి.ఎఫ్‌.జె.ఏ (తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌) – టి.ఎఫ్‌.డి.యం.ఎ (తెలుగు ఫిలిం డిజిటల్‌ మీడియా అసోసియేషన్‌) సభ్యులు. ఆ కంప్లైంట్‌కి సానుకూలంగా స్పందించిన పోలీస్‌బాస్‌ బుధవారం ఈ కేసును సి.ఐ.డికి అప్పచెప్పారు. ఈ సందర్భంగా టి.ఎఫ్‌.జె.ఎ ప్రెసిడెంట్‌ వారణాసి లక్ష్మీనారాయణ , జనరల్‌ సెక్రటరీ వై.జె రాంబాబు సిఐడిలోని సైబర్‌క్రైమ్‌ డిపార్ట్‌మెంట్‌ డియస్‌పి నేతృత్వంలోని కమిటీని కలిసి జరిగిన విషయాన్ని కంప్లైంట్‌ రూపంలో ఇచ్చారు. ముఖ్యంగా టి.ఎఫ్‌.జె.ఎ సభ్యులను టార్గెట్‌ చేస్తూ వ్యక్తిగత ధూషణలు చేస్తూ రాసిన ఆర్టికల్‌ ఒకటి ‘ప్రెవేట్‌షో.ఇన్‌’ వెబ్‌సైట్‌లో ప్రచురితమైంది.

మానసికంగా ఎంతో ఇబ్బంది పడ్డ జర్నలిస్ట్‌లంతా కలిసి ‘ప్రెవేట్‌షో.ఇన్‌’ వెబ్‌సైట్‌పై కంప్లైంట్‌ ఇవ్వటంతో డి.యస్‌.పి గారు స్పందించి క్రిమినల్‌ చర్యలకు పాల్పడినవారిని త్వరలోనే తీసుకువచ్చి విచారిస్తామని అన్నారు. ఇవేకాకుండా సినిమా పరిశ్రమలో వారు సోషల్‌మీడియాలో వచ్చే వార్తలకు, అసభ్యకరమైన యూట్యూబ్‌ థంబ్‌నెయిల్స్‌ పెట్టి వేధిస్తే టి.ఎఫ్‌.జె.ఏ–టి.ఎఫ్‌.డి.యం.ఎ సభ్యులకు కంప్లైంట్‌ చేయవచ్చు. తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ సభ్యులు త్వరలోనే దీనికి సొల్యూషన్‌ తీసుకురానున్నారు. ఈ కమిటీకి తెలుగు ఫిలిం చాంబర్‌ అఫ్‌ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్‌ కౌ