మే 10న బాక్సాఫీస్ వద్ద సినిమాల జాతర

ఈ వేసవిలో ఇప్పటివరకూ ఒకటీరెండు సినిమాలు తప్ప.. పెద్దగా ప్రేక్షకులను మెప్పించిన సినిమాలైతే రాలేదు. ఒకవైపు ఎన్నికల వేడి.. మరోవైపు ఐ.పి.ఎల్.. అయినా బాక్సాఫీస్ వద్ద వారం వారం కొత్త సినిమాల సందడి కొనసాగుతూనే ఉంది. ప్రతీ వారం ఒకటికి మించిన చిత్రాలతో బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఈ వారం కూడా బాక్సాఫీస్ కి కొన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి.

ముందుగా చెప్పుకోవాల్సింది సత్యదేవ్ ‘కృష్ణమ్మ‘. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో కృష్ణ కొమ్మలపాటి నిర్మించిన ఈ సినిమాకి వివి గోపాల కృష్ణ దర్శకుడు. ఈ మూవీలో సత్యదేవ్ కి జోడీగా అథిరా రాజ్ నటించింది. అన్యాయంగా ఓ కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువకుల కథతో ఈ సినిమా రూపొందింది. కాలభైరవ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. మే 10న ‘కృష్ణమ్మ‘ ఆడియన్స్ ముందుకు వస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం ఇప్పుడు మరింత వేడెక్కింది. ఇలాంటి తరుణంలో థియేటర్లలోకి రాబోతున్న అసలు సిసలు పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి 2’. ఇప్పటికే మంచి విజయాన్ని సాధించిన ‘ప్రతినిధి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందింది. పాపులర్ జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రమిది. కాంటెంపరరీ పాలిటిక్స్ ను ప్రస్తావిస్తూ తెరకెక్కిన ఈ సినిమాలో రోహిత్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. అసలు ఏప్రిల్ 25న ఆడియన్స్ ముందుకు రావాల్సిన ‘ప్రతినిధి 2’ అనివార్య కారణాలతో వాయిదా పడింది. లేటెస్ట్ గా మే 10న ‘ప్రతినిధి 2’ విడుదల తేదీ ఖరారు చేసుకుంది.

‘బాహుబలి‘ ఫేమ్ రాకేష్ వర్రె లీడ్ రోల్ లో నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి‘. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఉయ్యాల జంపాల, మజ్ను‘ ఫేమ్ విరించి వర్మ ఈ మూవీకి డైరెక్టర్. 1980 కాలంలో జరిగిన వాస్తవిక సంఘటనలు ఆధారంగా పొలిటికల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ‘జితేందర్ రెడ్డి‘ చిత్రం మే 10న విడుదలకు ముస్తాబవుతోంది.

మరోవైపు తమిళ అనువాద చిత్రం ‘సత్య‘ కూడా మే 10న రిలీజ్ కు రెడీ అవుతోంది. శివ మల్లాల నిర్మాణంలో రాబోతున్న ఈ సినిమా న్యూ ఏజ్ రొమాంటిక్ డ్రామాగా ఆడియన్స్ ముందుకు వస్తోంది.

ఇంకా.. ఈ వారం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రాలలో ‘ఆరంభం‘ ఒకటి. మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన

ఈ సినిమాని ఏవీటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 10న రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts