‘ఆర్య‘ అనుభవాలు పంచుకోబోతున్న టీమ్

‘ఆర్య‘ సినిమా.. అల్లు అర్జున్ ని హీరోగా నిలబెట్టిన చిత్రం. దర్శకుడిగా సుకుమార్ కి జీవితం ఇచ్చిన సినిమా. నిర్మాతగా దిల్ రాజు ను మరో మెట్టు ఎక్కించిన మూవీ. అల్లు అర్జున్, సుకుమార్, దేవిశ్రీప్రసాద్ కాంబోకి శ్రీకారం చుట్టింది కూడా ‘ఆర్య‘ చిత్రమే. ‘ఆర్య‘ సినిమా విడుదలై రేపటికి (మే 7) సరిగ్గా ఇరవై ఏళ్లవుతోంది. ఈ సందర్భంగా.. ‘ఆర్య‘ సినిమా 20 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాడట నిర్మాత దిల్ రాజు. ‘ఆర్య‘ సినిమాకి పనిచేసిన వారంతా ఈ వేడుకలో పాల్గొని.. ఆనాటి అనుభవాలను పంచుకోనున్నారట.

మే 7న ‘ఆర్య‘ సినిమా విడుదలై 20 ఏళ్లు పూర్తవుతుంటే.. మే 6న అంటే ఈరోజుకి సుకుమార్ మరో చిత్రం ‘100 పర్సెంట్ లవ్‘ విడుదలై 13 ఏళ్లవుతోంది. ‘ఆర్య‘ సినిమా తరహాలోనే సుకుమార్ తనదైన స్క్రీన్ ప్లే మ్యాజిక్ తో ‘100 పర్సెంట్ లవ్‘ని కూడా సూపర్ డూపర్ హిట్ చేశాడు.

గీతా ఆర్ట్స్ బ్యానర్ లో నాగచైతన్య, తమన్నా జంటగా ‘100 పర్సెంట్ లవ్‘ సినిమా వచ్చింది. ‘ఆర్య, 100 పర్సెంట్ లవ్‘ రెండు సినిమాలూ సమ్మర్ సీజన్లలోనే రావడం.. సూపర్ డూపర్ హిట్స్ అవ్వడం విశేషం.

Related Posts