‘ఆహా‘లో రానున్న ‘విద్య వాసుల అహం’

‘కోట బొమ్మాళి పి.ఎస్‘ సినిమాతో మంచి విజయాన్నందుకున్న రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘విద్య వాసుల అహం‘. ఈ సినిమాలో వీరిద్దరూ భార్య భర్తల పాత్రల్లో కనిపించనున్నారట. కొత్తగా పెళ్ళైన కపుల్ మధ్యన ప్రేమతో పాటు ఈగో కూడా మంచి రోల్ ప్లే చేస్తుంది. అలా.. నూతన వధూవరులైన విద్య, వాసుల మధ్య అహం ఎలాంటి పాత్ర పోషించింది అనేది ఈ సినిమాలో చూపించనున్నారట డైరెక్టర్ మణికాంత్ గెల్లి.

ఎటర్నిటీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో నవ్య మహేష్, ఏం రంజిత్ కుమార్ కొడాలి, చందనా కట్టా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, అభినయ, శ్రీనివాస్ రెడ్డి, తనికెళ్ల భరణి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలో ఆహా వేదికగా ‘విద్య వాసుల అహం‘ స్ట్రీమింగ్ కాబోతుంది

Related Posts