మంచు విష్ణు నటిస్తూ నిర్మాస్తోన్న మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘. శివ భక్తుడు కన్నప్ప కథాంశంతో అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న ‘కన్నప్ప‘ కోసం పలు భాషలకు సంబంధించిన పాపులర్ యాక్టర్స్ ను తీసుకున్నారు. ఈకోవలోనే.. హిందీ నుంచి అక్షయ్ కుమార్ ‘కన్నప్ప‘లో నటించాడు. ఏప్రిల్ 16న ‘కన్నప్ప‘ సెట్స్ లోకి అడుగుపెట్టిన అక్షయ్.. మూడు రోజుల క్రితమే తన పోర్షన్ మొత్తం పూర్తిచేసేశాడు.
‘కన్నప్ప‘ చిత్రంలో శివుడి పాత్రలో అక్షయ్ కనిపించబోతున్నాడు. ఇక.. ఈ మూవీలో తాను పోషించిన పాత్రకోసం ఏకంగా ఆరు కోట్ల రూపాయలు పారితోషికాన్ని అందుకున్నాడట అక్షయ్. కేవలం 10, 12 రోజుల కాల్షీట్స్ కోసమే అక్షయ్ కి.. ‘కన్నప్ప‘ మేకర్స్ ఈ రేంజ్ రెమ్యునరేషన్ ఇవ్వడం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
‘కన్నప్ప‘ సినిమాలో మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. ఇంకా.. రెబెల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే.. ప్రభాస్ ‘కన్నప్ప‘ సెట్స్ లోకి అడుగుపెట్టనున్నాడట.