విక్రమ్ తనయుడు ధ్రువ్ హీరోగా ‘బైసన్‘

విక్రమ్ తనయుడు ధ్రువ్.. ఓ క్రేజీ మూవీతో రెడీ అవుతున్నాడు. ‘అర్జున్ రెడ్డి‘ తమిళ రీమేక్ ‘వర్మ‘తో హీరోగా పరిచయమయ్యాడు ధ్రువ్. తొలి సినిమా ‘వర్మ‘ ధ్రువ్ కి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత తండ్రి విక్రమ్ తో కలిసి ‘మహాన్‘ సినిమా చేశాడు. ఈ సినిమాలో తన నటనతో తండ్రికి తగ్గ తనయుడనే కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమాతో రెడీ అవుతున్నాడు ధ్రువ్.

తమిళంలో ‘పరియేరమ్ పెరుమాల్, కర్ణన్, మామన్నన్‘ వంటి వరుస విజయాలందుకున్న మరి సెల్వరాజ్ దర్శకత్వంలో ధ్రువ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో ధ్రువ్ కి జోడీగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. లేటెస్ట్ గా ఈ మూవీకి ‘బైసన్.. కాలమాదన్‘ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంతేకాదు.. ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. ఈ సినిమాలో హీరో ధ్రువ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో కండలు తిరిగిన దేహంతో ఆకట్టుకుంటున్నాడు ధ్రువ్.

Related Posts