హాట్ ఫోటోస్ తో హాట్ టాపిక్కైన సమంత

సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో సమంత ముందు వరుసలో ఉంటుంది. ట్విట్టర్ లో పది మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సమంతకు ఇన్ స్టా గ్రామ్ లో 35 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఎప్పటికప్పుడు తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది సామ్.

లేటెస్ట్ గా సమంత తన ఇస్టా స్టోరీస్ లో పెట్టి డిలీట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇందులో ఒక ఫొటోలో టవల్ మాత్రమే చుట్టుకొని ఉంది సమంత. మరో ఫోటోలో ఒంటిమీద నూలు పోగు కూడా లేకుండా ఉంది.

దీంతో.. ఎన్నడూ లేనివిధంగా సమంత ఇలాంటి హాట్ ఫోటోస్ ను పోస్ట్ చేయడమేంటి? మళ్లీ డిలీట్ చేయడం ఏంటి? అంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. అయితే.. అవి నిజంగా సమంత పోస్ట్ చేసిందా? లేదా? అనే చర్చ కూడా నెట్టింట జోరుగానే సాగుతోంది.

మరోవైపు.. కొన్నాళ్లుగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్న సమంత.. సినిమాలను బాగా తగ్గించేసింది. తన సమయం మొత్తాన్ని ఆరోగ్యం కాపాడుకోవడానికి.. ప్రపంచం మొత్తం తిరగడానికి ఉపయోగిస్తుంది. ఇక.. వర్క్ ఫ్రంట్ లోకి వస్తే సమంత తన సొంత బ్యానర్ లో ‘మా ఇంటి బంగారం‘ అనే సినిమా చేయబోతుంది.

ఈ చిత్రంతో పాటు.. వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించిన ‘సిటాడెల్‘ వెబ్ సిరీస్ త్వరలో అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

Related Posts