బాలీవుడ్ లోనూ బిజీ అవుతోన్న కీరవాణి

తెలుగులో ఎమ్.ఎమ్. కీరవాణి, తమిళంలో మరకతమణి, హిందీలో ఎమ్.ఎమ్.క్రీమ్.. ఇలా పలు భాషల్లో పలు పేర్లతో పాపులారిటీ సంపాదించుకున్న వెర్సటైల్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి. ఆమధ్య సినిమాల నుంచే రిటైర్ మెంట్ తీసుకుంటానన్న కీరవాణి.. ఇప్పుడు మళ్లీ మ్యూజిక్ డైరెక్టర్ గా ఫుల్ బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే.

తెలుగులో రాజమౌళి-మహేష్ బాబు సినిమాతో పాటు.. చిరంజీవి ‘విశ్వంభర’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, ఆశిష్ రెడ్డి ‘లవ్ మీ’ వంటి సినిమాలున్నాయి. ఇప్పుడు హిందీలో అనుపమ్ ఖేర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘తన్వీ ది గ్రేట్‘ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు కీరవాణి. విలక్షణ నటుడిగా బాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న అనుపమ్ ఖేర్.. 2002లో ‘ఓం జై జ‌గ‌దీష్‘ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మళ్లీ 22 ఏళ్ల తర్వాత ‘త‌న్వి ద గ్రేట్‌’ కోసం మెగా ఫోన్ పట్టాడు అనుపమ్. ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇదే విషయాన్ని ఇన్ స్టా వేదిగా పంచుకున్నాడు అనుపమ్ ఖేర్. అంతేకాదు.. తన చిత్రానికి కీరవాణి సంగీతాన్ని స్వరపరుస్తున్న ఓ స్పెషల్ వీడియోని షేర్ చేశాడు.

Related Posts