‘రాజా సాబ్’.. ఓ విజువల్ వండర్

ప్రభాస్ మూవీస్ లిస్ట్ లో మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘రాజా సాబ్‘ ఒకటి. ‘కల్కి‘ విడుదల తర్వాత ప్రభాస్ నుంచి ఆడియన్స్ ముందుకొచ్చే సినిమా ఇదే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. త్వరలోనే తిరిగి పట్టాలెక్కించి మిగతా సినిమాని పూర్తిచేయనున్నారట.

ఇక.. ‘రాజా సాబ్‘ చిత్రాన్ని డైరెక్టర్ మారుతి తన గత చిత్రం ‘ప్రేమకథా చిత్రమ్‘ తరహాలో హారర్ కామెడీతో తీర్చిదిద్దుతున్నాడనే ప్రచారం జరిగింది. కాన్సెప్ట్ అలాంటిదే అయినా.. ఈ సినిమా బడ్జెట్, లుక్ టోటల్ గా హై లెవెల్ లో ఉండబోతున్నాయట. ప్రభాస్ ఇమేజ్ కు తగ్గట్టుగానే పాన్ వరల్డ్ రేంజులో నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందించేలా ‘రాజా సాబ్‘ను డిజైన్ చేశాడట డైరెక్టర్ మారుతి.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కి ఎంతో ప్రాధాన్యత ఉంటుందట. ముఖ్యంగా.. వి.ఎఫ్.ఎక్స్ కోసమే చాలా సమయాన్ని తీసుకుంటున్నాడట మారుతి. ఇదే విషయాన్ని లేటెస్ట్ గా ప్రొడ్యూసర్ టి.జి.విశ్వప్రసాద్ తెలిపారు. మొత్తంమీద.. ‘సలార్‘ తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న ‘కల్కి, రాజా సాబ్‘ చిత్రాలు కూడా బడ్జెట్, క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గేదే లే అంటూ రాబోతున్నాయన్నమాట.

Related Posts