కళ్యాణ్ రామ్ – విజయ్ సేతుపతి కాంబోలో సినిమా

ప్రస్తుతం ‘డెవిల్’ మూవీని రిలీజ్ కు రెడీ చేసిన కళ్యాణ్ రామ్.. ఆ తర్వాత ‘బింబిసార 2’ని లైన్లో పెట్టాడు. ‘బింబిసార’కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ‘బింబిసార 2’ వచ్చే యేడాది ఏప్రిల్ లేదా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోపులో మరో మూవీని లైన్లో పెట్టాడు ఈ నందమూరి హీరో. ‘ప్రేమ ఇష్క్ కాదల్’ ఫేమ్ పవన్ సాదినేనితో సినిమా చేయబోతున్నాడు. చాన్నాళ్ల క్రితమే కళ్యాణ్ రామ్ – పవన్ సాదినేని కాంబోలో మూవీ సెట్ అయ్యింది. అప్పట్లో ఈ చిత్రాన్ని ఓ మల్టీస్టారర్ గా ప్లాన్ చేశారు. కళ్యాణ్ రామ్ తో పాటు.. మరో పాత్రకు హరికృష్ణను అనుకున్నారు.

కానీ హరికృష్ణ మరణం తర్వాత ఆ ప్రాజెక్ట్ హోల్డ్ లోకి వెళ్లిపోయింది. ఇప్పుడు మళ్లీ ఈ ప్రాజెక్ట్ కార్యరూప్యం దాల్చుతుంది. ఈ సినిమాలో మరో హీరో పాత్రకోసం తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకుంటున్నారట.

కళ్యాణ్ రామ్ – విజయ్ సేతుపతి కాంబోలో మల్టీస్టారర్ అంటే ఆ క్రేజ్ వేరే లెవెల్ ఉంటుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. త్వరలోనే.. ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Related Posts