పట్టాలెక్కిన వరుణ్ తేజ్ ‘మట్కా‘

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస‘ ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మట్కా‘. లేటెస్ట్ గా ‘హాయ్ నాన్న‘తో హిట్ అందుకున్న వైరా ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇప్పటికే ముహూర్తాన్ని జరుపుకున్న ఈ చిత్రం తాజాగా షూటింగ్ మొదలు పెట్టుకుంది.

1958-82 మధ్య కాలంలో జరిగే పీరియాడిక్ స్టోరీగా ‘మట్కా’ రూపొందుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పలు విభిన్నమైన గెటప్స్ లో కనిపిస్తాడట. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ సినిమాకోసం హైదరాబాద్ అవుట్ స్కర్ట్స్ లో ప్రత్యేకంగా సెట్ ను నిర్మించారు. ఆ సెట్ లోనే ‘మట్కా‘ షూటింగ్ మొదలైంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడీగా మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి కనిపించనున్నారు. ఇతర కీలక పాత్రల్లో నవీన్ చంద్ర, కన్నడ కిషోర్ నటిస్తున్నారు. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

Related Posts