కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కళ్యాణ్ రామ్

న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో నందమూరి కళ్యాణ్ రామ్ ఎప్పుడూ ముందుంటాడు. కొత్త దర్శకులను పరిచయం చేయడంలోనూ.. ప్రయోగాత్మక కథాంశాలతో సినిమాలు చేయడంలోనూ.. తన విలక్షణతను చాటుకుంటుంటాడు. లేటెస్ట్ గా యంగ్ డైరెక్టర్ పవన్ సాదినేని తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ‘ప్రేమ ఇష్క్ కాదల్‘ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన పవన్ సాదినేని.. ఆ తర్వాత ఎక్కువగా వెబ్ సిరీస్ లు చేశాడు. పవన్ డైరెక్ట్ చేసిన ‘సేనాపతి, దయా‘ సిరీస్ లకు మంచి పేరొచ్చింది.

కళ్యాణ్ రామ్ కోసం ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ను సిద్ధం చేశాడట పవన్ సాదినేని. ఈ మూవీకి సంబంధించి త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. ప్రస్తుతం ‘డెవిల్‘ మూవీతో బిజీగా ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమా తర్వాత ‘బింబిసార 2‘ కూడా చేయాల్సి ఉంది. ‘బింబిసార‘ డైరెక్టర్ వశిష్ట.. చిరంజీవితో సినిమా చేస్తుండడంతో ‘బింబిసార 2‘ కోసం కొత్త దర్శకుడిని రంగంలోకి దింపే ప్రయత్నాలు జరుగుతున్నాయట.

Related Posts