ప్రభాస్-హను మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్?

ప్రభాస్ విష్ లిస్ట్ లో హను రాఘవపూడి సినిమా కూడా ఉంది. ‘సీతారామం‘తో పాన్ ఇండియా హిట్ కొట్టిన హను.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ పీరియాడిక్ మూవీ చేయడానికి సన్నాహాల్లో ఉన్నాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తన మార్క్ లవ్ స్టోరీతో ఈ సినిమాని తెరకెక్కించనున్నాడట డైరెక్టర్ హను రాఘవపూడి. యు.వి.క్రియేషన్స్ తో కలిసి ఓ బాలీవుడ్ పాపులర్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమాని నిర్మించనున్నట్టు సమాచారం.

ప్రభాస్ మూవీ కోసం తన రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ను తీసుకుంటున్నాడట హను. ఇప్పటికే హను దర్శకత్వం వహించిన ‘కృష్ణగాడి వీరప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం‘ చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్నందించాడు విశాల్ చంద్ర శేఖర్. ఇక.. ‘సీతారామం‘ పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో తెలిసిందే. ప్రభాస్-హను రాఘవపూడి మూవీపై త్వరలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది.

Related Posts