HomeLatestమోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగుతోన్న త్రివిక్రమ్?

మోక్షజ్ఞ కోసం రంగంలోకి దిగుతోన్న త్రివిక్రమ్?

-

టాలీవుడ్ లో రాబోయే వారసుల గురించి ప్రస్తావిస్తే.. వారిలో ముందుగా గుర్తొచ్చేది నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ. చాన్నాళ్లుగా మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ గురించి ప్రచారం జరుగుతూనే ఉంది. గతంలో బాలకృష్ణ వందో సినిమా ‘గౌతమీపుత్ర శాతకర్ణి‘లో మోక్షజ్ఞ నటించబోతున్నాడని వినిపించింది. అలాగే బోయపాటి ఈ నందమూరి మూడో తరం వారసుడిని పరిచయం చేస్తాడని.. ‘ఆదిత్య 369‘ సీక్వెల్ తో మోక్షజ్ఞ ఇంట్రడ్యూస్ అవుతాడని.. ఇలా రకరకాల ప్రచారాలు జరిగాయి. కానీ.. ఇప్పటివరకూ మోక్షజ్ఞ డెబ్యూ మూవీ గురించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా మరోసారి మోక్షజ్ఞ మూవీకి సంబంధించిన న్యూస్ ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ ఈసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మోక్షజ్ఞ సినిమాకి కథ అందించబోతున్నాడని. అదేమిటంటే.. ప్రస్తుతం బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో చేస్తున్నాడు. బాబీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ మూవీ ఇప్పటికే పట్టాలెక్కింది. సితార బ్యానర్ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉండనే ఉంటాడు. పైగా.. సితార బ్యానర్ లో త్రివిక్రమ్ కు చెందిన ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కూడా భాగస్వామి. అలా.. ఎన్.బి.కె. 109 సెట్స్ లో బాలకృష్ణ-త్రివిక్రమ్ మధ్య బాండింగ్ బలపడిందట. ఈనేపథ్యంలోనే మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి సంబంధించి టాపిక్ రావడం.. అందుకు కథ అందించడానికి త్రివిక్రమ్ ఒప్పుకోవడం జరిగిందనేది ఫిల్మ్ నగర్ టాక్.

ఇవీ చదవండి

English News