విశ్వక్‌సేన్ తో పోటీకి రెడీ అయిన కాజల్

సీనియర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘సత్యభామ’. ఫీమేల్ ఓరియెంటెడ్ గా సుమన్ చిక్కాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీకి శశి కిరణ్ తిక్కా స్క్రీన్ ప్లే సమకూరుస్తుండడం విశేషం. నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్థన్, రవి వర్మ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీనివాసరావు తక్కలపల్లీ, బాబీ తిక్క సంయుక్తంగా నిర్మిస్తున్న ‘సత్యభామ’ మే 17న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది.

ఇక.. మే 17న ఇప్పటికే రిలీజ్ డేట్ కన్ఫమ్ చేసుకుంది విశ్వక్ సేన్ నటిస్తున్న ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’. ‘గామి’తో డీసెంట్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్.. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. విశ్వక్ సేన్ కి జోడీగా నేహా శెట్టి నటించిన ఈ మూవీకి కృష్ణ చైతన్య దర్శకుడు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ రాబోతుంది.

Related Posts