‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ట్రైలర్.. పెళ్లి కోసం అల్లరోడి ఆరాటం

అల్లరోడు నరేష్ కాస్త గ్యాప్ తర్వాత నటించిన ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. మల్లీ అంకం దర్శకత్వంలో రాజీవ్ చిలకా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందింది. ఇప్పటికే టీజర్, సాంగ్స్ తో అలరిస్తోన్న ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజయ్యింది.

పెళ్లి కోసం మ్యాట్రిమోనీ చుట్టూ తిరిగే పాత్రలో అల్లరి నరేష్ కనిపించబోతున్నాడు. ఈమధ్య వరుసగా సీరియస్ మూవీస్ చేస్తున్న నరేష్.. మళ్లీ ఫుల్ లెన్త్ ఫన్ పంచబోతున్న సినిమా ఇది. ట్రైలర్ అయితే నరేష్ తరహా కామెడీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అల్లరి నరేష్ కి జోడీగా ఫరియా అబ్దుల్లా నటించింది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, హరి తేజ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మే 3న ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts