మరోసారి చిరంజీవి-విజయశాంతి కాంబో?

80, 90లలో సిల్వర్ స్క్రీన్ పై మ్యాజిక్ చేసిన జంటలలో చిరంజీవి-విజయశాంతి జోడీ ఒకటి. చిరంజీవితో ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్స్ లిస్ట్ లో విజయశాంతి మొదటి వరుసలో నిలుస్తుంది. దాదాపు 20 సినిమాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. చివరగా వీరిద్దరూ కలిసి 1993లో విడుదలైన ‘మెకానిక్ అల్లుడు’లో నటించారు. ఆ సందర్భంలోనే.. వీరిమధ్య ఏవో పొరపొచ్చాలు వచ్చాయి.

మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’తో రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. ఆ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చిరంజీవి-విజయశాంతి కలుసుకున్నారు. తమ మధ్య గొడవలు జరిగిన విషయాన్ని అంగీకరించారు.. కలిసిపోయారు. విషయమేమిటంటే.. ముఫ్ఫై ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ చిరు-విజయశాంతి కలిసి నటించబోతున్నారట.

మెగాస్టార్ ‘విశ్వంభర’ మూవీలో విజయశాంతి ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉండే ఓ రోల్ కోసం విజయశాంతిని అనుకున్నాడట డైరెక్టర్ వశిష్ట. అందుకు చిరు, విజయశాంతి కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. త్వరలోనే.. మెగాస్టార్ మూవీలో లేడీ అమితాబ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Related Posts