సూర్యకే గట్టి పోటీ ఇచ్చిన జ్యోతిక.. వర్కవుట్ వీడియో వైరల్

రీల్ లైఫ్ లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సూర్య-జ్యోతిక.. పెళ్లి చేసుకుని రియల్ లైఫ్ లోనూ ఉత్తమ జంటగా అందరికీ ఆదర్శంగా నిలిచారు. పెళ్లి తర్వాత కథానాయికల కెరీర్ క్లోజ్ అనేది ఇండస్ట్రీ టాక్. అయితే.. జ్యోతిక విషయంలో అలా జరగలేదు. పిల్లలు పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన జ్యోతిక.. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతోంది.

ఇక.. ఫిట్ నెస్ విషయంలో సూర్య ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో తెలిసిందే. ఇప్పుడు సూర్యకి మించిన రీతిలో కసరత్తులు చేస్తూ.. ఎప్పటికప్పుడు తన జిమ్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది జ్యోతిక. లేటెస్ట్ గా తన భర్త సూర్యతో కలిసి పోటాపోటీగా వర్కవుట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది. ఇందులో సూర్య-జ్యోతిక ఒకరికి మించిన రీతిలో మరొకరు పోటాపోటీగా జిమ్ లో కష్టపడుతున్న విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. ఆమధ్య సూర్య-జ్యోతిక విడిపోతున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. ఇప్పుడు ఈ వీడియోతో ఆ వార్తలకు చెక్ పెట్టినట్టు అయ్యింది.

Related Posts