ధైర్యానికి అవధులు లేవని నిరూపించిన హీరో అజిత్

రీల్ లైఫ్ లో సైతం రియల్ స్టంట్స్ తో అదరగొట్టే హీరోలు అరుదుగా ఉంటారు. హాలీవుడ్ లో అయితే టామ్ క్రూజ్ వంటి వారిని అందుకు ఉదాహరణగా చెప్పుకుంటాం. ఇక.. ఇండియాలో అలాంటి క్వాలిటీస్ పుష్కలంగా ఉన్న కథానాయకుడు అల్టిమేట్ స్టార్ అజిత్ కుమార్. రిస్కీ స్టంట్స్ చేయడానికి ఎంతో ఆసక్తి చూపించే అజిత్.. తన 62వ చిత్రం ‘విదా ముయార్చి’ కోసం చేసిన ఓ రిస్కీ స్టంట్ ఇప్పుడు టాప్ ది ఇండస్ట్రీగా మారింది.

‘విదా ముయార్చి’ చిత్రం కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలను విదేశాల్లో చిత్రీకరించారు. ఆ యాక్షన్‌ సీక్వెన్స్‌లో అజిత్ డూప్‌ లేకుండా నటించడంతో ఆయనకు ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ షేర్‌ చేసింది. డూప్ లేకుండా తానే స్వయంగా వెహికల్ నడిపాడు అజిత్. కారు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదం నుంచి ఆయన చిన్నపాటి గాయాలతో బయటపడ్డారు. ఈ వీడియోను షేర్‌ చేసిన నిర్మాణ సంస్థ ‘ధైర్యానికి హద్దులు ఉండవని నిరూపించిన హీరో..’ అంటూ అజిత్‌పై ప్రశంసలు కురిపించింది. ‘విదా ముయార్చి’ చిత్రానికి మగిళ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో అజిత్ కి జోడీగా త్రిష నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’లో నటించనున్నాడు అజిత్.

Related Posts