‘ఫ్యామిలీ స్టార్’ సెన్సార్ రిపోర్ట్ అదిరింది.. మరికొద్ది గంటల్లో థియేటర్లలో రచ్చ!

విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’ మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ దక్కింది. ఈమధ్య కాలంలో ఒక స్టార్ హీరో నటించిన చిత్రానికి క్లీన్ యు వచ్చిందంటే.. అది ఈ చిత్రమే అని చెప్పాలి. 2 గంటల 30 నిమిషాల నిడివితో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతోందని సెన్సార్ రిపోర్ట్.

‘ఫ్యామిలీ స్టార్’ సినిమాని ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరించారు. తెలుగుతో పాటు తమిళంలోనూ రేపు గ్రాండ్ గా ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్ కు రెడీ అవుతోంది.

Related Posts