సండే టాప్ గ్రాసర్స్ లో జవాన్

ఈ నెల 7న విడుదలైన జవాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా డిక్లేర్ అయింది. నాలుగు రోజుల్లోనే 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డే ఒన్ నుంచే ఈ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఇండియాలోనే కాక ఇతర దేశాల్లో సైతం ఇంతకు ముందెప్పుడూ లేనంతగా వసూళ్లు సాధిస్తోంది. ముఖ్యంగా హిందీ సినిమాగా రికార్డుల పరంగా ఇప్పటికే ఎన్నో సంచలనాలు నమోదు చేసింది జవాన్. షారుఖ్ ఖాన్, నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి, సాన్యా మల్హోత్రా వంటి భారీ తారాగణంతో పాటు అనిరుధ్ సంగీతం మరో హైలెట్ గా దర్శకుడు అట్లీ క్రియేట్ చేసిన ఈ మాస్ మ్యాజిక్ కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే నాలుగో రోజైన ఆదివారం ఈ చిత్రానికి వసూళ్లు కాస్త తగ్గాయి. అందుకు కారణం ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ ఉండటమే అనుకుంటున్నారు. అలా కాకపోయినా ఓ కొత్త రికార్డ్ మాత్రం సాధించింది. అదీ హిందీ నుంచి మాత్రమే.


ఆదివారం రోజు హయ్యొస్ట్ వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో జవాన్ నాలుగో స్థానంలో నిలిచింది. మరి ఫస్ట్ ప్లేస్ ఎవరిది అనే కదా.. ఇంకెవరూ.. మన ఆర్ఆర్ఆర్ దే. రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా, అలియా భట్, సముద్రఖని, అజయ్ దేవ్ గణ్, శ్రీయ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం మొదటి ఆది వారం రోజు ఏకంగా 102 . 03 కోట్లు సాధించి ఫస్ట్ సండే టాప్ గ్రాసర్ గా నిలిచింది.


ఇక రెండో స్థానంలో కూడా రాజమౌళి విజువల్ వండర్ బాహుబలి నిలిచింది. బాహుబలి ది కంక్లూషన్ అంటూ వచ్చిన సెకండ్ పార్ట్ మొదటి ఆదివారం సాధించిన కలెక్షన్స్ 93 కోట్లు గ్రాస్. ఫస్ట్ పార్ట్ కు వచ్చిన అప్లాజ్ వల్ల ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. అందుకే కలెక్షన్స్ పరంగా ఇప్పటికీ ఇండియాలో నెంబర్ వన్ గా ఉంది బాహుబలి2.


ఇక థర్డ్ ప్లేస్ లో కేజీఎఫ్ చాప్టర్2 ఉంది. ఇదీ అంతే.. ఫస్ట్ పార్ట్ అనూహ్యంగా బ్లాక్ బస్టర్ కావడంతో రెండో చాప్టర్ కు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ ఈ కన్నడ సినిమా మొదటి ఆదివారం రోజు 91.75 కోట్లు వసూళ్లు సాధించింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ క్రియేట్ చేసిన ఈ డార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ ఎన్నో రికార్డులు కూడా సొంతం చేసుకుంది.


ఇక ఇప్పుడు వచ్చిన జవాన్ నాలుగో స్థానంలో నిలిచింది. జవాన్ మొదటి ఆదివారం 80కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నిజానికి ఈ చిత్రానికి వచ్చిన క్రేజ్ చూస్తే ఇంకా ఎక్కువే రావాల్సింది. కానీ క్రికెట్ మ్యాచ్ కారణంగా వెనకబడింది అని చెప్పాలి. ఇక లిస్ట్ గా చూస్తే.. ఇప్పటి వరకూ విడుదలైన భారీ సినిమాలు మొదటి ఆదివారం సాధించిన కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

  1. ఆర్ఆర్ఆర్ – 102.03 కోట్లు
  2. బాహుబలి 2 – 93 కోట్లు
  3. కేజీఎఫ్ 2 – 91. 75 కోట్లు
  4. జవాన్ – 80+ కోట్లు

సో ఇప్పటికీ టాప్ గ్రాసర్ అంటే మొదటి ఆదివారం లో మొదటి రెండు స్థానాల్లో తెలుగు సినిమాలే ఉన్నాయన్నమాట.

Related Posts