త్రిషతో లిప్ లాక్ అంటే వద్దన్నాట్ట

అందగత్తె అధర చుంబనం ఇస్తానంటే అబ్బే వద్దు అనేవాళ్లుంటారా..? ఉంటారు. కొందరు ఉంటారు. అందగత్తెలతో సరసం కాదు.. అద్బుతమైన కెరీరే ఇంపార్టెంట్ అని భావించే హీరోలూ ఉంటారు. అఫ్ కోర్స్ అతను హీరోగా మాత్రమే కాదు. విలన్ గానూ అదరగొడుతున్నాడు. తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో తన అద్భుత నటనతో అదరగొడుతున్నాడు. మరి ఆ హీరో ఎవరో కాదు. విజయ్ సేతుపతి. మందలో ఒకడిగా మొదలైన విజయ్ సేతుపతి కెరీర్ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అనే వరకూ వచ్చింది. ఈ ప్రయాణంలో హీరోగా ఎన్నో విజయాలున్నాయి. విలన్ గా ఆకట్టుకున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శెభాష్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం జవాన్ సినిమాలో అతను చేసిన విలనీకి కంట్రీ మొత్తం ఫిదా అయింది.


2018లో వచ్చిన ’96’ అనే సినిమా తమిళనాట రికార్డులు క్రియేట్ చేసింది. సంచలన సినిమాగా బ్లాక్ బస్టర్ అయింది. ఓటిటి, టివిల్లో ప్రసారం అవుతున్నప్పుడు కూడా ఈ చిత్రానికి థియేటర్స్ లో వసూళ్లు తగ్గలేదు. అంత పెద్ద విజయం సాధించిన ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్.. విజయ్ సేతుపతి, త్రిష జోడీ. ఈ ఇద్దరూ అత్యంత సహజమైన నటనతో చూసిన ప్రతి ఒక్కరి హృదయాలను బరువెక్కించారు. ఓ గొప్ప లవ్ స్టోరీస్ లో ఒకటిగా ఈ చిత్రాన్ని తమిళ ఇండస్ట్రీ, మీడియా కొనియాడింది.

ఈ సినిమాలోనే విజయ్, త్రిషల మధ్య ఓ లిప్ లాక్ సీన్ ప్లాన్ చేశాడట దర్శకుడు. అందుకు త్రిష కూడా ఓకే చెప్పింది. బట్ విజయ్ నో అన్నాడు. ఎందుకంటే ఆ సీన్ వచ్చేది క్లైమాక్స్ లో. అప్పటికే వేరే వ్యక్తితో ఓ బిడ్డకు తల్లైన త్రిష పాత్రకు తను ముద్దు పెడితే అప్పటి వరకూ ఉన్న ఫీల్ అంతా లస్ట్ అవుతుందని చెప్పాడట. అంతే కాదు.. తనకు ఈ లిప్ లాక్ సీన్స్ అంటే ఇష్టం లేదని కూడా అన్నాడట.

నిజానికి త్రిష లాంటి అందగత్తెతో ముద్దు సీన్ అంటే దాదాపు ఎవరూ నో చెప్పరు. పైగా ఆమె కూడా ఒప్పుకున్న తర్వాత. బట్ విజయ్ మాత్రం తను ఆ సీన్ చేయను అన్నాడట. దీంతో దర్శకుడు ఆ సీన్ లేకుండానే క్లైమాక్స్ పూర్తి చేశాడు. ఈ సినిమా చూసిన ఎవరికైనా క్లైమాక్స్ అద్భుతంగా అనిపించిందంటే కారణం ఆ సీన్ లేకపోవడమే అని ఒప్పుకుని తీరతారు. కొన్నిసార్లు జడ్జిమెంట్ తో పాటు వ్యక్తిత్వం కూడా విజయం సాధిస్తుందనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ.

Related Posts