జిగర్తాండ డబుల్ ఎక్స్ టీజర్.. డబుల్ డోస్

జిగర్తాండ.. 2014లో వచ్చిన సినిమా. ఓ లోకల్ గూండా కథతో సినిమా తీయాలనుకున్న యువకుడి కథ. ఆ సినిమా ఆ గూండాను మారుస్తుంది. మంచి వాడిని చేస్తుంది. అతన్ని భయపడి పారిపోయినవాళ్లే సినిమా హీరోగా తెరపై కనిపించగానే విజిల్స్ కొడతారు. ఆ విజిల్స్ లోని ప్రేమను చూసిన సదరు గ్యాంగ్ స్టర్ మారిపోతాడన్నమాట. గ్యాంగ్ స్టర్ పాత్రలో బాబీ సింహా నటించాడు. డైరెక్టర్ గా సిద్ధార్థ్ నటించాడు. ఈ సినిమాకు బాబీకి బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్ రావడం విశేషం. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ అనేక అవార్డులూ గెలుచుకుంది.


ఈ చిత్రాన్నే ఆ తర్వాత గద్దలకొండ గణేష్ అంటూ తెలుగులో వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ రీమేక్ చేశాడు. ఇక్కడ డైరెక్టర్ పాత్రలో తమిళ్ హీరో అధర్వ మురళి నటించాడు. తెలుగులోనూ కమర్షియల్ గా మంచి విజయం సాధించిందీ చిత్రం.

ప్రస్తుతం జిగర్తాండకు సీక్వెల్ గా మరో సినిమా వస్తోంది. “జిగర్తాండ డబుల్ ఎక్స్” అనేది కొత్త టైటిల్. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను మహేష్ బాబు చేతుల మీదుగా విడుదల చేవారు. ఓ రకంగా ఈ టీజర్ చూశాక దీన్ని ప్రీక్వెల్ అనాలేమో.


1975లో ఓ దర్శకుడు, గ్యాంగ్ స్టర్ కలిసి సినిమా తీయాలనుకున్నారు. తీశారు. దానికి అప్పట్లోనే ప్యాన్ ఇండియన్ సినిమా అని పేరు పెట్టారు. సరిగా పలకడం రాక పాండ్యన్ సినిమాగా మారిపోయింది అన్నట్టుగా ఉందీ టీజర్. ఈ సారి ప్రధాన పాత్రల్లో ఎస్జే సూర్య, రాఘవ లారెన్స్ నటించారు. రోల్ కెమెరా అనగానే ఓ యాక్షన్ సీక్వెన్స్, సౌండ్ అనగానే మరో యాక్షన్ సీక్వెన్స్, యాక్షన్ అనగానే మరో యాక్షన్ సీక్వెన్స్.. ఇలా ఉంది టీజర్. కంప్లీట్ రగ్డ్ లుక్ తో కనిపిస్తోంది. కలరింగ్ నుంచి మేకింగ్ వరకూ 1975 కాలాన్ని ప్రతిబింబించే విధంగా ప్రయత్నించారు.

ఓవరాల్ గా చూస్తే ఈ టీజర్ మెప్పించేలా ఉంది. సినిమా కూడా గ్యారెంటీ హిట్ అనేలా ఉంది. పెద్దగా ఆడ వాసన లేకుండానే ఈ టీజర్ కట్ చేశారు. మరి సినిమాలో ఎలా ఉంటుందో కానీ.. ఈ జిగర్తాండ డబుల్ ఎక్స్ దీపావళికి విడుదల కాబోతోంది.

Related Posts