జైలర్ ట్రైలర్.. ఈ సారి మిస్ అయ్యేలా లేడు

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్. రజినీకాంత్ సినిమా అంటే తమిళ్ తో పాటు అదే రోజు తెలుగులోనూ రావాల్సిందే కదా.. అలాగే వస్తోంది. ఈ నెల 10న జైలర్ విడుదల కాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన మరుక్షణమే సూపర్ స్టార్ ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడు అని స్పష్టంగా అర్థం అయ్యేలా ఉంది. ఆ రేంజ్ లో ఉంది మేకింగ్. కంటెంట్ కూడా బలంగానే కనిపిస్తోంది. జైలర్ అనే టైటిల్ ఉంది కానీ ట్రైలర్ లో ఆ పార్ట్ పెద్దగా కనిపించలేదు. బట్.. దర్శకుడు నెల్సన్ ఈ సారి ఏదో మ్యాజిక్ చేస్తున్నాడు అని మాత్రం తెలుస్తోంది. ట్రైలర్ ఆరంభంలోనే ఎడారి లాంటి ప్రాంతంలో పెద్ద వైడ్ షాట్.. ఓ చిన్న రోడ్ లో వరుసగా వాహనాలు.

వాటిపైకి మినీ మిస్సైల్ ప్రయోగించే విదేశీయులు. ఆ వెంటనే స్నైపర్ షాట్స్ తో అందులో ఉన్నవారిని చంపేయడం.. ఈ విజువల్ చూస్తే ఇది తమిళ్ మూవీనా హాలీవుడ్ ఆ అనే డౌట్ వస్తుంది.


ఆ వెంటనే మన సునిల్ ఫ్రేమ్. మేం సిబిఐ నుంచి వచ్చాం అని ఒక వ్యక్తి చెప్పగానే.. డొనేషన్ ఏమైనా కావాలా అంటాడు సునిల్. అతని గెటప్ చిత్రంగా ఉంది. వీటికి భిన్నంగా రజినీకాంత్ ఎంట్రీ. ఇంట్లో కూర్చుని పోలీస్ ఆఫీసర్ అయిన కొడుకు, అతని కొడుకు షూస్ క్లీన్ చేస్తూ.. తనకు నచ్చిన చట్నీ కోసం భార్యను అడుగుతూ ఉంటాడు. కూరగాయలు తెస్తూ దారిలో యోగిబాబు కార్ కు అడ్డం పడటం అతను అందుకు ఫైన్ వేస్తా అని చెప్పడం ఒక సెటప్ లా ఉంది. సడెన్ గా పులిలా మారతాడు.. అని మరో క్యారెక్టర్ డైలాగ్ పడగానే రజినీకాంత్ ఓ వ్యక్తిని కత్తితో పొడిచి సన్నగా ఓ లుక్ ఇస్తాడు. అది ఫ్యాన్స్ కు పూనకం తెప్పించే లుక్.

అటుపై మెయిన్ విలన్ వినాయకన్ ఎంట్రీ. నా జీవితంలో ఫస్ట్ టైమ్ నన్ను బ్లాక్ మెయిల్ చేయడం చూస్తున్నాం అనే డైలాగ్ అతను ఒక వ్యక్తిని క్రూరంగా చంపేస్తాడు. ఆ తర్వాత అసలు విలన్ జాకీష్రాఫ్‌ ఎంట్రీ. రజినీ ఫోన్ లో ‘నువ్వు అతన్ని ఓ పోలీసోడి తండ్రిలా మాత్రమే చూసి ఉంటాం” అంటాడు. దానికి జాకీ “నాకు అతనికే తెలిసిన అతని రెండో మొహం కూడా తెలుసు” అంటాడు. దానికి ‘ఒక పాయింట్ తర్వాత నేను మాట్లాడను. ఏసేయడమే” అని రిప్లై ఇస్తాడు రజినీ. తర్వాత మొదలవుతుంది అసలు ట్రైలర్. ఇది కదా రజినీ నుంచి మేం ఎక్స్ పెక్ట్ చేసేది అన్నట్టుగా ప్రతి ఫ్రేమ్ నెక్ట్స్ లెవల్ అన్నట్టుగా ఉంది. ప్రతి షాట్ ఖచ్చితంగా కనిపిస్తుంది.

ముఖ్యంగా రజినీకాంత్ ఇంట్లోకి వచ్చిన ఓ రౌడీని రజినీ ఫాలోవర్ చంపేస్తే అతను డైనింగ్ టేబుల్ మీద నుంచి అతని భార్య(రమ్యకృష్ణ) కూతురు పై పడిపోవడం ఓహో సినిమా చూడాల్సిందే అనిపిస్తే.. రమ్యకృష్ణ.. ఎందుకు ఇదంతా ఆపేయొచ్చు కదా అంటుంది. దానికి ‘చాలా దూరం వెళ్లాను. అంతా ముగించి కానీ తిరిగిరాను’ అంటాడు. ఈ డైలాగ్ సినిమాలో రజినీ పాత్ర రేంజ్ ను చెబుతుంది. మొత్తంగా చూస్తే సూపర్ స్టార్ సినిమా అంటే ఇప్పుడు ఆడియన్స్, అభిమానులు ఏం ఎక్స్ పెక్ట్ చేస్తున్నారో అలాంటి అన్ని అంశాలను మిక్స్ చేసి ఓ కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ తో వస్తున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్సన్ రేంజ్ ను మార్చే సినిమాలా ఉంది.


ఇక ట్రైలర్ లోని ఆర్ఆర్ చూస్తే అనిరుధ్ మరోసారి రెచ్చిపోయాడనుకోవచ్చు. విక్రమ్ లో కమల్ హాసన్ కు తన ఆర్ఆర్ తో ఎంత ఎలివేషన్ ఇచ్చాడో.. అంతకు రెండింతలు ఈ సినిమాలో చూడబోతున్నారు అనేలా ఉంది ఆర్ఆర్. ట్రైలర్ తో అంచనాలు త్రిబుల్ అయిపోతాయని మాత్రం చెప్పొచ్చు. వాటిని రీచ్ అయితే జైలర్ బాక్సాఫీస్ ను వణికించడం ఖాయం.

Related Posts