600 కోట్ల క్లబ్ లో జైలర్ .. ఏ రాష్ట్రం నుంచి ఎంత

సూపర్ స్టార్ రజినీకాంత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. ఈ వయసులో కూడా తన సినిమాకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ బద్ధలైపోతుందని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. కొన్నాళ్లుగా సరైన హిట్ లేక ఇబ్బంది పడుతోన్న సూపర్ స్టార్ కు ఈ విజయం తిరుగలేని ఉత్సాహాన్ని ఇచ్చింది.

డే వన్ నుంచే బ్లాక్ బస్టర్ టాక్ తో ప్రపంచ వ్యాప్తంగా దూసుకుపోతోన్న ఈ చిత్రం ఓ అరుదైన మైలురాయిని చేరింది. జైలర్ 600 కోట్ల క్లబ్ లో చేరింది. చాలామంది 500 కోట్లతో ఆగిపోతుంది అని భావించారు. బట్ వస్తోన్న సినిమాలేవీ ఆకట్టుకోకపోవడం ఓ కారణంతో పాటు.. మాస్ కు ఫుల్ ఫీస్ట్ లా ఉండటం మరో కారణంగా రిపీటెడ్ ఆడియన్స్ తో ఈ మూవీ 600 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది.

మరి ఈ 600 కోట్లలో ఏ స్టేట్ నుంచి ఎంత వచ్చిందనేది చూస్తే.. జైలర్ ను కొన్నవాళ్లు ఏ రేంజ్ లో లాభాలు చూశారో అర్థం అవుతుంది. ఎగ్జాక్ట్ ఫిగర్స్ కాపోయినా అప్రాక్స్ మేట్ గా చూస్తేనే ఈ కలెక్సన్స్ ఇలా ఉన్నాయి..

తమిళనాడు నుంచి – 220 కోట్లు
తెలుగు స్టేట్స్ నుంచి – 75 కోట్లు
కేరళ నుంచి – 60 కోట్లు
కర్ణాటక నుంచి – 60 కోట్లు
ఇతర రాష్ట్రాల నుంచి – 17 కోట్లు
ఓవర్శీస్ నుంచి – 175 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా – 607 కోట్లు

ఇదీ జైలర్ బాక్సాఫీస్ ఊచకోత. ఈ కలెక్షన్స్ ఇంకా పెరుగుతాయని కూడా చెబుతున్నారు. కాకపోతే తెలుగులో సెప్టెంబర్ 1న వచ్చే ఖుషీ జైలర్ దూకుడుకు అడ్డుకట్ట వేస్తుందంటున్నారు. అది జరగకపోతే తెలుగులో కూడా మరిన్ని కలెక్షన్స్ వస్తాయి. ఏదేమైనా బాక్సాఫీస్ కింగ్ ఎప్పటికీ తనే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు సూపర్ స్టార్.

Related Posts