సౌత్ నుంచి 600 కోట్ల సినిమాలు ఎన్ని ..?

600 కోట్లు.. ఒకప్పుడు మన సినిమాల కలెక్షన్స్ 50 కోట్లు వస్తేనే అమ్మో అనుకున్నారు. తర్వాత టార్గెట్ 100 అయింది. వంద కోట్ల క్లబ్ లో జాయిన్ కావాలని ప్రతి హీరో అనుకున్నాడు. ఆ మేరకు కథలు ఎంచుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. ఇది సౌత్ మొత్తం వర్తిస్తుంది. బట్ ఈ లెక్కలన్నీ మార్చాడు మన జక్కన్న.

ఒకే ఒక్క సినిమాతో సౌత్ కే కాదు.. ఎంటైర్ కంట్రీకే కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు.ఆ మూవీ బాహుబలి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యస్ బాహుబలి మన ఇండియన్ సినిమా ముఖచిత్రాన్నే మార్చివేసింది. మేకింగ్ నుంచి కలెక్షన్స్ వరకూ హాలీవుడ్ కు మనం ఏ మాత్రం తీసిపోమని ప్రపంచ సినిమా ముందు మన సినిమాను సగర్వంగా నిలబెట్టింది.

అందుకే ఇప్పుడు అందరికీ కొత్త టార్గెట్ 500 లేదా 1000 కోట్లు అయింది. బడ్జెట్ ను బట్టి.. స్టార్స్ ను బట్టి ఈ ఫిగర్ డిసైడ్ అవుతోంది. అయితే తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ జైలర్ మూవీ 600 కోట్ల క్లబ్ లో చేరింది. దీంతో ఇప్పటి వరకూ 600 కోట్లు దాటి కలెక్షన్స్ సాధించిన సౌత్స సినిమాలు ఎన్ని ఏంటీ అనే కొత్త లెక్కలు మొదలయ్యాయి.

అలా చూస్తే నార్త్ నుంచి పఠాన్ తప్ప మరోటి కనిపించదు. సో.. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే మనదే.. అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ 600 కోట్ల క్లబ్ అంటే కేవలం 600 కోట్లు అని మాత్రమే కాదు.. ఆ ఫిగర్ ను దాటి కలెక్షన్స్ సాధించిన సినిమాలన్నమాట. మరి ఈ లిస్ట్ లో ఉన్న సౌత్ సినిమాలేంటో చూద్దాం..
ముందుగా ఈ స్థానం రాజమౌళి బాహుబలిదే.

బాహుబలి 2 – 1810.59 కోట్లు
ఆర్ఆర్ఆర్ – 1276.20 కోట్లు
కేజీఎఫ్‌ చాప్టర్2 – 1259.14 కోట్లు
2.ఓ –800 .00 కోట్లు
బాహుబలి 1 – 650 .00 కోట్లు
జైలర్ – 607 .29(ఆదివారం నాటికి) కోట్లు

సో మొత్తం 600 కోట్ల క్లబ్ లో సౌత్ నుంచి మొత్తం 6 సినిమాలున్నాయి. రాబోయే సినిమాల లెక్కలు చూస్తుంటే 2024 వరకూ ఈజీగా పద సినిమాలు దాటతాయి అనుకోవడావడానికి ఏ మాత్రం మొహమాట పడాల్సిన అవసరమే లేదు. మొత్తంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మార్చింది.. మన తెలుగోడు కావడం ఓ రకంగా మనకూ గర్వ కారణమే.

Related Posts