ఈ సారీ కొట్టకపోతే ఇంకా కష్టం

హీరో కావాలన్న తపన చాలామందికి ఉంటుంది. అవకాశాలు అందరికీ రావు. వచ్చిన వాళ్లు నిలబెట్టుకుంటారన్న గ్యారెంటీ లేదు. వాళ్లు ఏదైతే నమ్మి ఓ సినిమా చేస్తారో.. అది ఆడియన్స్ కు కరెక్ట్ గా కనెక్ట్ కాపోతే అది వారి కెరీర్ పై ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలో కొందరు ఒకటీ రెండు సినిమాలకే వెను తిరుగుతారు. ఇంకొందరు పోరాటం చేస్తూనే ఉంటారు. బట్ హిట్స్ లేకపోతే ఈ పోరాటం ఎంతో కాలం సాగదు. అందుకే ఇండస్ట్రీలో ఉండాలంటే హిట్ అనే మాట నిరంతరం కాకపోయినా వినిపిస్తూ ఉండాలి.

ప్రస్తుతం ఇలాంటి సిట్యుయేషన్ లోనే ఉన్నాడు కార్తికేయ. రెండో సినిమాగా వచ్చిన ఆర్ఎక్స్ 100 అతన్ని ఓవర్ నైట్ ఫేమ్ చేసింది. తర్వాత హిప్పీ, గుణ369 చేశాడు. ఇవి అంతగా ఆకట్టుకోలేదు. నానీస్ గ్యాంగ్ లీడర్ తో విలన్ గానూ మారాడు.ఈ సినిమా పోయింది. అటుపై ఎక్స్ పర్మెంటల్ గా 90ఎమ్ఎల్, చావుకబురు చల్లగా వంటి సినిమాలు చేస్తే అవీ ఆకట్టుకోలేదు. అదే టైమ్ లో కోలీవుడ్ టాప్ హీరో అజిత్ కు విలన్ గా వలిమై అనే సినిమా చేస్తే అదీ పోయింది. ఇలా ఒక్క హిట్ తో ఇన్ని సినిమాలకు నెట్టుకు వచ్చాడు అనుకోవచ్చు. అదే వీటిలో మరో రెండు హిట్స్ ఉండి ఉంటే కార్తికేయ గురించి ఇలా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చి ఉండేది కాదేమో.


ఇక ఇప్పుడు బెదురులంక 2012 అనే సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ ఎప్పుడో పూర్తయింది. రిలీజ్ డేట్ ఫైనల్ కాక చాలా కాలంగా ఆగింది. చివరికి ఈ నెల 25న విడుదల కాబోతోందని చెప్పారు. అదే రోజు వరుణ్‌ తేజ్ నటించిన గాండీవధారి అర్జున కూడా వస్తుంది. అతనితో పోటీ పడుతూ ఈ బెదురులంక సినిమాతో వస్తున్నాడు. డిజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించాడు.

క్లాక్స్ అనే కొత్త దర్శకుడు రూపొందించాడు. 2012లో కలియుగం అంతం అయిపోతుందనే పుకార్లు బాగా వచ్చాయి. వాటి ఆధారంగా ఒక గ్రామంలో జరిగిన సంఘటనల సమాహారంగా ఈ సినిమా రూపొందిందని ఆ మధ్య వచ్చిన టీజర్ చూస్తే తెలిసింది. తర్వాత వచ్చిన పాటలు ఆకట్టుకున్నాయి. అయితే ఇలా టీజర్లు, పాటలు ఆకట్టుకోవడం ఏ సినిమాకైనా దాదాపు కామన్. కానీ సినిమా మెప్పించడమే టఫ్ టాస్క్. ఆ టాస్క్ లో ఈ సారి కార్తికేయ ఖచ్చితంగా సక్సెస్ కావాలి. లేదంటే కెరీర్ ప్రమాదంలో పడుతుంది.

ఇప్పటికే ఈ సినిమాపై నమ్మకంతోనో లేక నిజంగా వేరే ఆఫర్లు రాకపోవడం వల్లో కానీ.. బెదురులంక తర్వాత మరో సినిమా లేదు. దీని రిజల్ట్ ను బట్టి అతనే కాదు.. ఇతర ప్రొడ్యూసర్లు కూడా ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం పాజిటివ్ గా లేకపోతే కార్తికేయ హీరోగా కంటిన్యూ కావడం చాలా కష్టం అవుతుందనే చెప్పాలి. సో.. కుర్రాడు ఈ సారి గట్టిగా కాకపోతే కొట్టాలి.. ఖచ్చితంగా కొట్టాలి.

Related Posts