రష్మిక కోలీవుడ్ లో మరో ప్రయత్నం

శాండల్ వుడ్ తో పరిచయమై టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అనిపించుకుని బాలీవుడ్ లోనూ దూసుకుపోతోన్న బ్యూటీ రష్మిక మందన్నా. మంచి పీఆర్ వల్ల ఆమెను నేషనల్ క్రష్ అనిపించగలిగారు. ప్రస్తుతం టాలీవుడ్ కంటే బాలీవుడ్ పైనే ఎక్కువ ఫోకస్ చేస్తోందీ బ్యూటీ. ఇక్కడ పుష్ప2 తో పాటు బటర్ ఫ్లై అనే సినిమాలు చేస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ సరసన నీరజా కోన దర్శకురాలుగా పరిచయం అవుతున్న సినిమాలో తనే హీరోయిన్ అనే ప్రచారమూ ఉంది.

అయితే అమ్మడికి కోలీవుడ్ లో జెండా ఎగరేయాలన్న కోరిక అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ల క్రితం కార్తీ సరసన సర్దార్ అనే సినిమాతో అక్కడ అడుగుపెట్టింది. బట్ ఫస్ట్ మూవీ పోయింది. తర్వాత విజయ్ సరసన వారిసు అనే సినిమా చేసింది. ఇందులో ఆమెది కరివేపాకు లాంటి పాత్ర. ఒక పాట రెండు మూడు సీన్స్ కే పరిమితం అయ్యింది. దీంతో ఇదీ సరైన ప్లాట్ ఫామ్ కాలేకపోయింది. అయినా మరోసారి తనకు కోలీవుడ్ ఆఫర్ వచ్చే అవకావం ఉంది.


ఈ యేడాది మాలీవుడ్ ను కలెక్షన్స్ తో షేక్ చేసిన సినిమా “2018”. జూడ్ ఆంటోనీ జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. మళయాలంలో అత్యంత వేగంగా వంద కోట్లు సాధించిన సినిమాగా రికార్డ్స్ క్రియేట్ చేసింది. తెలుగులోనూ బాగా చూశారు జనం. ఈ దర్శకుడు త్వరలోనే తమిళ్ లో కార్తీ హీరోగా ఓ ప్యాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీలో విక్రమ్ కు జోడీగా రష్మిక మందన్నాను గతంలోనే తీసుకున్నారు. అయితే అప్పట్లో డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకునే ప్రయత్నాలు చేసింది.

తను లేకపోతే మాళవిక మోహనన్ ను తీసుకోవాలనుకున్నారు మేకర్స్. బట్ ఈ ప్రాజెక్ట్ పై ఉన్న అంచనాలతో రష్మిక డేట్స్ ను అడ్జెస్ట్ చేయడానికి ఓకే చెప్పింది. త్వరలోనే తన ఎంట్రీ గురించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుంది. ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా నటిస్తుండటం విశేషం. మొత్తంగా ఈ మూవీ అయినా రష్మికకు కోలీవుడ్ లో ప్లేస్ ను ఇస్తుందేమో చూడాలి.

Related Posts