సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ

సంక్రాంతి అంటే మన సినిమా వారికి ఎక్కడ లేని ఉత్సాహం కనిపిస్తుంది. ఆ టైమ్ కు విడుదల చేయాలని అందరూ ప్రయత్నిస్తారు. అఫ్‌ కోర్స్ మాగ్జిమం పెద్ద హీరోల సినిమాలే సందడి చేస్తుంటాయి. వీరి మధ్యలో వచ్చి కొన్ని చిన్న సినిమాలు అప్పుడప్పుడూ సర్ ప్రైజింగ్ గా వాటిని కాదని బ్లాక్ బస్టర్ అయిన సందర్భాలూ అనేకం ఉన్నాయి.

2024 సంక్రాంతికి గట్టి పోటీయే ఉంది. ఇప్పటికే రవితేజ ఈగల్, ప్రశాంత్ వర్మ హను మాన్ తో పాటు గుంటూరు కారం సినిమాలు సంక్రాంతిని టార్గెట్ చేసుకున్నాయి. వీటిలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న తీరును బట్టి చూస్తే గుంటూరు కారం డౌటే అంటున్నారు. బట్ ఆ రెండు మాత్రం కన్ఫార్మ్. అదే టైమ్ లో ప్రభాస్ “కల్కి 2898 ఏడి” సినిమా ఉంటుందన్నారు. కానీ డేట్ మారినట్టే అనుకోవచ్చు. రీసెంట్ గా వచ్చిన టీజర్ లో వాళ్లు 2024 రిలీజ్ అన్నారు తప్ప సంక్రాంతి రిలీజ్ అనలేదు. ఇక ఈ రేజ్ లోకి విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని ఖచ్చితంగా తెలుస్తోంది.


దిల్ రాజు బ్యానర్ లో పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తోన్న చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలని దిల్ రాజు ప్లాన్ చేశాడు. ఈ సినిమా ఎక్కువ భాగం విదేశాల్లోనే చిత్రీకరణ జరుపుకోబోతోంది. సెప్టెంబర్ నుంచి ఏకధాటిగా 30 రోజుల పాటు యూఎస్ లో చిత్రీకరణ చేస్తారట. ఈ 30 రోజుల షూటింగ్ తోనే సినిమా 80శాతం పూర్తవుతుందంటున్నారు. అంటే మిగతా ఇరవైశాతం ఇండియాలో ఉంటుంది. అదేమంత కష్టం కాదు. సో.. ఈ ప్లాన్ పక్కాగా అమలైతే.. సంక్రాంతి రిలీజ్ పెద్ద కష్టం కాదు.

అందుకే దిల్ రాజు సంక్రాంతి బరిలో ఈ సినిమాను విడుదల చేయాలని చూస్తున్నాడు. ఒకవేళ గుంటూరు కారం ఉన్నా కూడా దిల్ రాజుకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. సొంత థియేటర్స్ ఉన్నాయి. తను చెబితే కాదనే డిస్ట్రిబ్యూటర్స్ లేరు. సో.. సంక్రాంతికి విజయ్ దేవరకొండ సినిమా వస్తుందనే అనుకోవాలి. సో పండగ సీజన్ కు పోటీ మరింత పెరుగుతుందన్నమాట.

Related Posts